Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ‘కింగ్‌డమ్'(Kingdom). జులై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ స్పై యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Vijay Deverakonda
‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి బ్లాక్‌బస్టర్ క్లాసిక్స్ అందించిన విలక్షణ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ( Gautam Tinnanuri)డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీకి, ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అదిరిపోయే హైప్ క్రియేట్ చేసింది.
ఈ గ్రాండ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తన స్పీచ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. విజయ్ మాట్లాడుతూ, “ఈసారి నేరుగా మీ ముందుకు వచ్చాను. నా మనసులో గత ఏడాది నుంచి ఒకటే బలంగా ఉంది. మన తిరుపతి వెంకన్న స్వామి నా పక్కన ఉంటే, నేను చాలా పెద్ద స్టార్‌గా ఎదుగుతాను, టాప్ పొజిషన్‌లో నిలబడతాను” అని భావోద్వేగంగా అన్నాడు.
“ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా నేను ప్రాణం పెట్టి కష్టపడ్డాను. ఇక మిగిలింది రెండే – ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు. ఎవ్వరూ మనల్ని ఆపేదే లే!” అంటూ విజయ్ ఇచ్చిన పవర్‌ఫుల్ స్పీచ్ అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదల కానుందని గుర్తుచేస్తూ, “ఏడుకొండల వెంకన్న నన్ను చూసుకో స్వామి” అంటూ విజయ్ తన ప్రసంగాన్ని ముగించాడు.
‘కింగ్‌డమ్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు, సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘కింగ్‌డమ్’ ఇప్పటికే సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా పట్ల పాజిటివ్‌గా స్పందించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ మూవీలో విజయ్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. విజయ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా విజయ్ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపాడని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, భారీ అంచనాలతో వస్తున్న ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.