War 2: వార్ 2 బాక్సాఫీస్ సునామీ..రెండు రోజుల్లోనే రికార్డుల మోతలు

War 2: యశ్ రాజ్ ఫిల్మ్స్ యొక్క స్పై యూనివర్స్‌లో గత చిత్రం 'వార్' రికార్డును బద్దలు కొట్టేసింది.

War 2

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, మన టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో రూ. 52 కోట్లు (నెట్) వసూలు చేయగా, వరల్డ్‌వైడ్‌గా రూ.85 కోట్లు (గ్రాస్) రాబట్టింది. రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగి, ఇండియాలో రూ. 56.5 కోట్లు (నెట్) వసూలు చేసింది. కేవలం హిందీ వెర్షన్ నుంచే రూ. 44.5 కోట్లు వచ్చాయి.

రెండు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్ రూ. 109 కోట్లు దాటగా, ఓవర్సీస్ గ్రాస్ రూ. 40 కోట్లుగా ఉంది. దీంతో, మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 160 కోట్లను దాటింది.
ఈ భారీ కలెక్షన్లతో వార్ 2(War 2) కేవలం రెండు రోజుల్లోనే యశ్ రాజ్ ఫిల్మ్స్ యొక్క స్పై యూనివర్స్‌లో గత చిత్రం ‘వార్’ రికార్డును బద్దలు కొట్టేసింది.

బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, సౌత్‌లో ఎన్టీఆర్.. ఈ ఇద్దరు స్టార్ల కలయిక సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఇద్దరి ఫ్యాన్స్‌ కూడా థియేటర్లలో తమ అభిమాన హీరోలను చూసేందుకు పోటీపడటం వల్లే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధ్యమయ్యాయన్న టాక్ నడుస్తోంది.

దీనికితోడు వరుస శెలవులు ముఖ్యంగా ఆగస్టు 15న సినిమా విడుదల కావడంతో సెలవు రోజు కలెక్షన్లకు బాగా కలిసొచ్చింది. ‘కూలీ’ వంటి అగ్రహీరోల మరో సినిమా పోటీ ఉన్నా, ‘వార్ 2’ (War 2)తన మార్క్‌ను చూపించగలిగింది.

War-2

హిందీతో పాటు తెలుగు, తమిళం వంటి భాషల్లో కూడా సినిమాను విడుదల చేయడం వల్ల కలెక్షన్లు ఊహించని విధంగా పెరిగాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజునే రూ. 22 కోట్లు నెట్ కలెక్షన్లు రాబట్టడం సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్.

కలెక్షన్ల పరంగా ‘వార్ 2′(War 2) దూసుకెళ్తున్నా, కంటెంట్ పరంగా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సినిమాలో యాక్షన్, స్టార్ల స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయని చాలామంది చెబుతున్నారు. కానీ, కథలో లోపాలు, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ లోపాలపై విమర్శలు వచ్చాయి.

హాలిడే సీజన్, ఫ్యాన్స్ హైప్ వల్ల భారీ ఓపెనింగ్స్ వచ్చినా, సినిమా లాంగ్ రన్‌లో నిలబడాలంటే ‘వర్డ్ ఆఫ్ మౌత్’ (WOM) చాలా ముఖ్యం. మిశ్రమ సమీక్షల కారణంగా కలెక్షన్లు మూడో రోజు నుంచి స్థిరంగా ఉండే అవకాశం ఉంది. సినిమా నిజమైన సత్తా రాబోయే రోజుల్లో తేలుతుంది. మొత్తానికి ‘వార్ 2′(War 2) గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నా, కథ పరంగా కొన్ని ప్రశ్నలను మిగిల్చిందనే చెప్పాలి.

Exit mobile version