Heroines
సినీ ఇండస్ట్రీలోకి తిరిగి రావడం అనేది ఒక రిస్క్. కానీ కొందరు సీనియర్ హీరోయిన్లకు(Heroines) అది బాగానే వర్కవుట్ అయింది. ఒకప్పుడు వెండితెరను ఏలిన భూమిక, రమ్యకృష్ణ, రాశి వంటి కథానాయికలు మంచి క్యారెక్టర్ రోల్స్‌తో తిరిగి వచ్చి సక్సెస్ అయ్యారు. అయితే, ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు హీరోయిన్లకు మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత, ఒక మంచి కథతో తిరిగి ప్రేక్షకులను పలకరిద్దామనుకుంటే, వారి ఆశలు నిరాశగా మారాయి.
జెనీలియా.. 14 ఏళ్ల తర్వాత ‘బొమ్మరిల్లు’ మ్యాజిక్ మిస్సయ్యింది. ‘బొమ్మరిల్లు’, ‘డి’, ‘రెడీ’ ‘happy’వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన నటి జెనీలియా( Genelia). ఆమె చలాకీ నటనకు, చిలిపి నవ్వుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి జెనీలియా పెళ్లి తర్వాత సుమారు 14 ఏళ్లుగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు. తిరిగి వస్తే ప్రేక్షకులు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతారని ఆశించారు. కానీ ఆమె రీ-ఎంట్రీ ఇచ్చిన ‘కిరీటి జూనియర్’ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు తన పేరుతో సినిమాను నడిపిన జెనీలియాకు, ఈ సినిమా ఏమాత్రం కలిసిరాలేదు.
లయ.. 18 ఏళ్ల తర్వాత సైలెంట్ కమ్ బ్యాక్ . స్వయంవరం’, ‘ప్రేమించు’ వంటి హిట్ సినిమాలతో ఒకప్పుడు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లయ( Laya). ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆమె కూడా తిరిగి తెలుగు సినిమాల్లోకి వచ్చారు. ‘తమ్ముడు’ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించినప్పటికీ, ఆ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్ళిందో చాలామందికి తెలియదు. లయ రీ-ఎంట్రీకి ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడలేదు. ఒకప్పుడు తన నటనతో అలరించిన లయ, రీ-ఎంట్రీలో మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోయారు.
అన్షు.. 20 ఏళ్ల తర్వాత నిరాశ. మన్మథుడు సినిమాలో నాగార్జున సరసన నటించి, ప్రేక్షకులను మాయ చేసిన అన్షును ఎవరూ మర్చిపోలేరు. కేవలం రెండు సినిమాలతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండి విదేశాల్లో స్థిరపడ్డ అన్షు(Anshu), సుమారు 20 ఏళ్ల తర్వాత ‘మజాకా’ చిత్రంతో తిరిగి వచ్చారు. ‘మన్మథుడు’ హీరోయిన్ రీ-ఎంట్రీ అనగానే అప్పట్లో కొంత హైప్ కూడా క్రియేట్ అయింది. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌గా మారడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి.
మొత్తానికి, ఒకప్పుడు ప్రేక్షకుల మనసు దోచిన ఈ ముగ్గురు సీనియర్ హీరోయిన్లకు వారి కమ్ బ్యాక్ కలిసిరాలేదు. కమ్ బ్యాక్ సక్సెస్ కావాలంటే కేవలం పాపులారిటీ ఉంటే సరిపోదని, సరైన కథ, ఆడియన్స్ టేస్ట్ తగ్గ ప్రాజెక్టులను ఎంచుకోవాలని ఈ ఉదాహరణలు నిరూపిస్తున్నాయి.