AI : వ్యవ ‘సాయం’ చేసే ఏఐ వచ్చేసింది..

AI : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఏఐ ఇప్పుడు వ్యవసాయంలో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. దీంతో మనిషి అవసరం లేకుండానే వ్యవసాయం(farming) చేసేయొచ్చు.

AI : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఏఐ ఇప్పుడు వ్యవసాయంలో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. దీంతో మనిషి అవసరం లేకుండానే వ్యవసాయం(farming) చేసేయొచ్చు. కొత్త టెక్నాలజీతో ఇప్పుడు ఈ కలను నిజం చేస్తున్నాడు వాషింగ్టన్‌(Washington)లోని ఆండ్రూ అనే సాప్ట్‌వేర్ ఇంజనీర్.

AI for farming

పచ్చని పలూస్ ప్రాంతంలో, ఆండ్రూ నెల్సన్ అనే రైతుకు చెందిన 7,500 ఎకరాల పొలంలో ట్రాక్టర్ తన పనేదో తాను చేసుకుంటూ దూసుకుపోతోంది. క్యాబిన్ లోపల ఆండ్రూ స్టీరింగ్ వీల్‌ను పట్టుకోలేదు. బదులుగా, ఆయన ఒక జూమ్ కాల్‌లో ఉన్నారు ఆ తర్వాత వరుసగా మెసేజ్‌లు చెక్ చేసుకుంటున్నాడు.అయినా అతని వ్యవసాయం పనులు మాత్రం కంటెన్యూగా సాగిపోతూనే ఉన్నాయి. ఇదంతా మాయలా ఉన్నా కూడా ఇది పచ్చి నిజం.

41 ఏళ్ల ఆండ్రూ నెల్సన్(Andrew Nelson) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాత్రమే కాదు, ఈ తరం ఫార్మర్ కూడా. మనం ఆహారాన్ని పండించే, కోసే విధానాన్ని సమూలంగా మారుస్తున్న ఒక నవశకానికి ఆండ్రూ ఒక సారథి. ఇక్కడ ట్రాక్టర్ కేవలం తనంతట తానుగా నడవడమే కాదు. దానిలోని సెన్సార్లు, కెమెరాలు, విశ్లేషణాత్మక సాఫ్ట్‌వేర్ సహాయంతో ఎప్పుడు, ఎక్కడ ఫెర్టిలైజర్ చల్లాలి లేదా కలుపు మొక్కలను తొలగించాలనే విషయాలన్నిటిని అదే నిరంతరం నిర్ణయించుకుంటుంది.

Andrew Nelson

పొలంలో డ్రోన్‌ల గ్రూప్, ఆటోనమస్ ట్రాక్టర్లు, హార్వెస్టర్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరక్షన్లోనే పని చేస్తాయి. మట్టి స్వభావం, వాతావరణం ఆధారంగా ఏఐ (AI) నిమిష నిమిషానికి కూడా తనను సెట్ చేసుకుని పనులు చకాచకా చేసేస్తుంది. వేల ఎకరాల్లో మొక్కల కండిషన్‌ను సెన్సార్లు పర్యవేక్షిస్తాయి, అవసరమైన చోట స్ప్రేలు చల్లడం, నీటిని అందించడం వంటివి కూడా అవే చేసేస్తాయి.

రైతులు ట్రాక్టర్ క్యాబిన్‌లో గంటల తరబడి గడిపే బదులు, డ్యాష్‌బోర్డ్‌లను గమనిస్తూ తన పని తాను చేసుకుంటే చాలు. ప్రతి విత్తనం, ప్రతి నీటి బిందువు, ప్రతి గ్రాము ఎరువు కూడా దిగుబడులను పెంచడానికి, భూమిని రక్షించడానికి సరైన పద్ధతిలో ఉపయోగపడుతుంది. ఒక కనెక్టెడ్ సిస్టమ్ ద్వారా ప్రతి సీజన్‌తో మరింత స్మార్ట్‌గా మారుతూ ఈ ప్రోసెస్ జరుగుతుంది.

ఆండ్రూ నెల్సన్, మైక్రోసాఫ్ట్ కోసం వ్యవసాయ టెక్నాలజీ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆయన పొలంలో డ్రైనేజీ. కలుపు మొక్కల పరిమాణాన్ని రికార్డ్ చేయడానికి మల్టీస్పెక్ట్రల్ ఇమేజ్‌లను తీయడానికి కూడా ఒక డ్రోన్‌ను ప్రయోగిస్తారు.

AI for farming

కొన్ని డీర్ కంపెనీకి చెందిన పెద్ద స్ప్రేయర్‌లు ‘సీ & స్ప్రే’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఇది కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించి కలుపు మొక్కలను టార్గెట్ చేసుకుంటుంది. పండ్లను కోయడానికి ప్రత్యేక రోబోట్లు, అలాగే పర్యవేక్షణకు డ్రోన్‌లు ఉపయోగిస్తున్నారు.

సాయిల్ ఆప్టిక్స్ సిస్టమ్ మ్యాపింగ్ కోసం ఏర్పాటు కూడా ఉంటుంది. ఇందులో వాహనంపై గామా-రేడియేషన్ స్పెక్ట్రోమీటర్, ఎడమవైపు సాయిల్-కోర్ శాంప్లర్, డేటా-కలెక్ట చేయడానికి కంప్యూటర్ , RTK GPS టెక్నాలజీ కూడా ఉన్నాయి.మొత్తంగా వ్యవసాయంలోకి కూడా దూకిన ఏఐ తన హవాను ఎంత వరకూ కొనసాగిస్తుందో చూడాలి మరి.

 

Exit mobile version