Bikinis: ఈ దేశాల్లో బికినీలు ధరించడం నిషేధమని తెలుసా? భారీ జరిమానాలు కూడా..

Bikinis: సంస్కృతి, సాంప్రదాయాలు, మతపరమైన పద్ధతుల వల్ల కొన్ని దేశాలు , ప్రాంతాలు బికినీలు, స్విమ్ సూట్స్ ధరించడంపై కఠినమైన నిషేధాలను విధించాయి

Bikinis

విదేశాల్లో బికినీ (Bikini) ధరించడం సాధారణంగా భావించినా కూడా ప్రపంచంలోని అన్ని చోట్లా ఈ వెస్ట్రన్ కల్చర్ నడవదు. సంస్కృతి, సాంప్రదాయాలు, మతపరమైన పద్ధతుల వల్ల కొన్ని దేశాలు , ప్రాంతాలు బికినీలు, స్విమ్ సూట్స్ ధరించడంపై కఠినమైన నిషేధాలను విధించాయి. నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో వాటిని ధరిస్తే, భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బీచ్‌లు (పాక్షికంగా).. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రాస్ అల్-ఖైమా రాష్ట్రం, దాని సముద్ర తీరాలలో బికినీలు, స్విమ్ సూట్స్ ధరించడంపై 2013లో నిషేధం విధించింది. దీనికి కారణం, శరీర ప్రదర్శన చేసే పర్యాటకులతో కలిసి స్థానిక ముస్లిం కుటుంబాలు బీచ్‌లలో ఆసక్తి చూపకపోవడం. అయితే, దుబాయ్ బీచ్‌లలో మాత్రం ఇలాంటి నిషేధం లేదు. కానీ, ఇక్కడ కూడా ఇతర సందర్శకులకు ఇబ్బంది లేకుండా ‘మర్యాదగా’ నడుచుకోవాలని అధికారులు పర్యాటకులకు సూచిస్తుంటారు.

Bikinis

స్పెయిన్ (కొన్ని ప్రాంతాలు).. ఎండ వేడిమి ఎక్కువగా ఉండే ఈ దేశంలో బికినీలు సాధారణమే అనిపించినా, 2011లో రాజధాని మాడ్రిడ్ , చుట్టుపక్కల ఐలాండ్‌లలో బికినీ ధరించి బహిరంగంగా తిరగడాన్ని నిషేధించారు. బీచ్‌లకు దూరంగా ఉన్న పట్టణ వీధుల్లో బికినీ వేసుకుని పట్టుబడితే, నిబంధనలు అతిక్రమిస్తే 500 యూరోల (సుమారు రూ.45,000) వరకు భారీ జరిమానా విధిస్తారు.

మాల్దీవులు (పబ్లిక్ బీచ్‌లు)… సుమారు 1,200 దీవుల సమూహం, అత్యంత అందమైన పర్యాటక గమ్యస్థానం అయిన మాల్దీవులు ఒక ముస్లిం దేశం. ఇక్కడ రూల్స్ కఠినంగా ఉంటాయి. పర్యాటక రిసార్ట్ బీచ్‌ల్లో మాత్రమే బికినీలకు అనుమతి ఉంది. స్థానికులు నివసించే పబ్లిక్ బీచ్‌లలో ఈత దుస్తులు, బికినీలు(Bikinis) ధరించడం నిషేధం. పర్యాటకులు తప్పనిసరిగా సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించాలి.

హ్వార్, క్రొయేషియా.. క్రొయేషియాలోని హ్వార్ దీపం కూడా బికినీ(Bikinis)ల నిషేధానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాచీన పట్టణం గుండా నడిచే పర్యాటకులు చాలా గౌరవప్రదంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం కోరుకుంటోంది. బహిరంగంగా తినడం, తాగడం, షర్ట్ లేకుండా లేదా స్విమ్ సూట్‌లో ధరించి తిరగడం ఇక్కడ నిషేధం. ఇక్కడ రూల్స్ బ్రేక్ చేస్తే దాదాపు 600 యూరోల (సుమారు రూ.54,000) వరకు జరిమానా విధిస్తారు. ‘మీ డబ్బును ఆదా చేసుకోండి.. హ్వార్‌ను ఆస్వాదించండి’ అనే బోర్డులు కూడా పర్యాటకులను హెచ్చరిస్తూ ఇక్కడ కనిపిస్తాయి.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version