Airline: చావు కళ్ల ముందుకు వస్తే .. అక్కడ జరిగింది అదే..

Airline : కప్పుడు  హాయిగా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణం ఇప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాగాల్సిన ప్రయాణంగా మారింది.

Airline : అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఇటీవల వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు, కుదుపుల సంఘటనలు, ఇంజన్లో లోపం సమస్యలు ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని పెంచుతున్నాయి. ఒకప్పుడు  హాయిగా, సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునే ప్రయాణం ఇప్పుడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాగాల్సిన ప్రయాణంగా మారింది.

Airline

తాజాగా, సాల్ట్ లేక్ సిటీ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం గాల్లో ఉండగా భారీ కుదుపులకు గురవ్వడంతో, అందులోని ప్రయాణికులు చావును కళ్ల ముందు చూశారు. గాల్లో ఆడుతున్న పడవలా విమానం అల్లల్లాడినప్పుడు, తమ ప్రాణాలు పోతున్నాయేమోనని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొంతమంది హార్ట్ అటాక్‌కు కూడా గురయినట్లు బాధితులు చెబుతున్నారు

సాల్ట్ లేక్ సిటీ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్తున్న డెల్టా ఫ్లైట్ DL56 గాల్లో ఉన్నప్పుడు అనుకోకుండా భారీ కుదుపులకు గురైంది. దీంతో పైలట్ చాకచక్యంగా మినియాపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది

విమానం దిగిన వెంటనే, అగ్నిమాపక, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని, 25 మంది ప్రయాణికులను పరీక్షల కోసం, చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయాలు ఎవరికీ కాలేదు. కానీ ఈ సంఘటన వారి మనసుల్లో మాత్రం చెరిగిపోని భయాన్ని మిగిల్చిందని అక్కడి వారు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం, విమాన ప్రయాణాల పట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని, భయాన్ని పెంచుతోంది.

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదం.

2024 మేలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం కుదుపులకు గురైనప్పుడు ఒక ప్రయాణికుడు మరణించగా, చాలామంది గాయపడ్డారు.

జూలై 18న డెల్టా విమానం అట్లాంటాకు వెళ్లేందుకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

ఈ వరుస సంఘటనలు చూస్తుంటే, సాంకేతిక లోపాలు, వాతావరణ మార్పుల పేరుతో జరుగుతున్న ఈ ప్రమాదాలు విమాన ప్రయాణికులకు ఒక పీడకలగా మారుతున్నాయి. ఈ మధ్య విమానం ఎక్కాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

Exit mobile version