Trump: ట్రంప్ కు బిగ్ షాక్..  న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఓటమి

Trump: ఈ సారి స్థానిక ఎన్నికల్లో రెండు మిలియన్లకుపైగా ఓటర్లు ఓటు వేశారని అక్కడి అధికారులు వెల్లడించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 1969 తర్వాత ఇలా భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి.

Trump

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాచ డొనాల్డ్ ట్రంప్(Trump) ఎన్నడూ లేని వ్యతిరేకత కూడగట్టుకుంటున్నారు. చుట్టు పక్కల దేశాలే కాదు సొంత ప్రజల్లోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తాజాగా అమెరికా స్థానిక ఎన్నికల ఫలితాలు ట్రంప్(Trump) కు దిమ్మతిరిగే షాకిచ్చాయి. ముఖ్యంగా అధికార రిపబ్లికన్ పార్టీకి కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవిని ఆ పార్టీ కోల్పోయింది.

తాజా ముగిసిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ మేయర్ గా విజయం సాధించారు. అలాగే వర్జీనియాలో సైతం రిపబ్లిక్ పార్టీకి చుక్కెదురైంది. ఇక్కడ డెమోక్రటిక్ పార్టీకి చెందిన అబిగైల్ స్పాన్‌బెర్గర్ గెలుపొందారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ గా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.

ఇదిలా ఉంటే ట్రంప్ (Trump)రిపబ్లిక్ పార్టీకి చెందిన క్యూమోకు 41.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మమ్దానీకి 49.06 ఓట్లు పడ్డాయి.మమ్దానీ దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘనవిజయం అందుకున్నారు. మమ్దానీ భారతీయ, ఉగాండా మూలాలు ఉన్న వ్యక్తి. భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల వయస్సు నుంచి అమెరికాలో ఉంటున్న ఆయన 2018లో పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Trump

మరోవైపు ఈ సారి స్థానిక ఎన్నికల్లో రెండు మిలియన్లకుపైగా ఓటర్లు ఓటు వేశారని అక్కడి అధికారులు వెల్లడించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో 1969 తర్వాత ఇలా భారీ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన అతిపిన్న వయస్సుడిగా మమ్దానీ రికార్డులకెక్కారు.

ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకం కావడంతో తన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. తన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే న్యూయార్క్ కు భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తానంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ గత కొంతకాలంగా పలు సంచలన నిర్ణయాలతో అమెరికా ప్రజల్లో ట్రంప్ పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. చివరికి ఈ అసంతృప్తే స్థానిక ఎన్నికల్లో బయటపడినట్టు అర్థమవుతోంది.

మరోవైపు వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అబిగైల్ స్పాన్‌బెర్గర్ కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు.. అబిగైల్ స్పాన్‌బెర్గర్‌కు 14.8 లక్షల ఓట్లు , ఆమె ప్రత్యర్థి సీయర్స్ కు 11.6 లక్షల ఓట్లు వచ్చాయి. స్పాన్‌బెర్గర్ తన ప్రచారంలో అధ్యక్షుడు ట్రంప్ విధానాలను నిరసిస్తూ తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు. అటు ప్రభుత్వ షట్‌డౌన్ అంశం కూడా ఆమెకు బాగా కలిసొచ్చింది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version