Six planets
ఆకాశంలో అద్భుతాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. అటువంటి అరుదైన ఖగోళ దృశ్యం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా స్కైవాచర్లను, ఖగోళ శాస్త్ర ప్రియులను ఆకట్టుకుంది. ఆగస్టు 19న ఆరు గ్రహాలు ఒకేసారి ఆకాశంలో కనిపించాయి. ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని ‘ఆరు గ్రహాల కవాతు(Six planets)’గా అభివర్ణించారు.
ఆగస్టు 19న సూర్యోదయానికి సుమారు ఒక గంట ముందు, ఆరు గ్రహాలు ఒకదాని తరువాత ఒకటి తూర్పు ఆకాశంలో కనిపించాయి. ఇవి నిజంగా ఒకదానికొకటి దగ్గరగా ఉండవు. ఇదంతా ఒక విజువల్ ఎఫెక్ట్ మాత్రమే. భూమి నుంచి చూసినప్పుడు, అన్ని గ్రహాలు దాదాపు ఒకే వక్ర రేఖపై (ఎక్లిప్టిక్) ఉన్నట్లు కనిపిచాయి. ఈ ఎక్లిప్టిక్ అనేది సౌర వ్యవస్థలో గ్రహాలు తిరిగే కక్ష్యల మార్గం. ఈ దృగ్విషయం కారణంగా, భూమిపై నుంచి చూసేవారికి అవి ఒకే వరుసలో ఉన్నట్లు ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించాయి.
ఈ ఆరు గ్రహాలలో(Six planets) శుక్రుడు, బృహస్పతి, శని, బుధుడు కంటితో చూడగలిగేంత ప్రకాశవంతంగా ఉంటాయి. కానీ, ఈ కవాతులో భాగమైన యురేనస్, నెప్ట్యూన్‌లను చూడటానికి మాత్రం టెలిస్కోప్ తప్పనిసరి.
ఈ ఖగోళ దృశ్యాన్ని చూడటానికి ప్రత్యేక పరికరాలు ఏమీ అవసరం లేదు. తెల్లవారుజామున తూర్పున ఆకాశంలో ఈ గ్రహాలు స్పష్టంగా కనిపించాయి. అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనలు సాధారణ ప్రజలలో అంతరిక్షం పట్ల, శాస్త్రం పట్ల ఉత్సుకతను పెంచుతాయి. ఉల్కాపాతాలు లేదా గ్రహణాలు కాకుండా, ఇవి ఒక స్థిరమైన, అందమైన దృశ్యాన్ని అందిస్తాయి.
గ్రహాలు చాలా పెద్ద సమూహంలా కనిపించినా కూడా..వాటిని వేరు చేసే వాస్తవ దూరాలు చాలా ఎక్కువ. ఉదాహరణకు, ఆగస్టు 19న బుధుడు భూమి నుంచి దాదాపు 128 మిలియన్ కిలోమీటర్లు, శుక్రుడు 190 మిలియన్ కిలోమీటర్లు, బృహస్పతి 882 మిలియన్ కిలోమీటర్లు, శని 1,430 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
ఎందుకు ఈ దృశ్యం అంత ప్రత్యేకమైనదంటే..ఆగస్టులో జరిగిన ఈ ఆరు గ్రహాల కవాతు ఖగోళ శాస్త్రంపై ప్రజల్లో ఆసక్తిని పెంచింది. ఇలాంటి సంఘటనలు అంతరిక్షం గురించి అపోహలను తొలగించి, శాస్త్రీయ వాస్తవాల గురించి తెలుసుకోవడంలో సహాయపడతాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుతాలు చూడొచ్చు.
మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తర్వాత మరో ముఖ్యమైప గ్రహ కవాతు అక్టోబర్ 2028లో జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఐదు గ్రహాలు తెల్లవారుజామున ఆకాశంలో కలిసి కనిపిస్తాయి.అంతులేని ఈ విశ్వంలో జరిగే ఇలాంటి సంఘటనలు మనల్ని నిరంతరం ఆశ్చర్యపరుస్తాయి, సైన్స్ పట్ల మన ఆసక్తిని పెంచుతాయి.