Trump: మా రియాక్షన్ కూడా చూస్తారు ట్రంప్ కు చైనా స్ట్రాంగ్ కౌంటర్

Trump: ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ దుయ్యపట్టింది.

Trump

రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Trump) తీసుకుంటున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తన సొంత దేశంలోనే ఈ నిర్ణయాలకు వ్యతిరేకత రావడమే కాదు అటు మిగిలిన దేశాలతోనూ కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సుంకాల విధింపు విషయంలో ట్రంప్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇతర దేశాలను రెచ్చగొడుతున్నారు. ముందు భారత్ పైనా.. తర్వాత చైనా పైనా సుంకాలు 100 శాతం విధించడమే దీనికి ఉదాహరణ. అయితే తాజాగా చైనా ట్రంప్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ దుయ్యపట్టింది. అమెరికా అధ్యక్షుడి(Trump) తీసుకుంటున్న ఈ నిర్ణయాల తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆరోపించింది. సహజంగా తాము ఎవరితోనూ గొడవలు పెట్టుకోమని, అవసరం వస్తే మాత్రం పోరాడటానికి సిద్ధంగా ఉంటామంటూ హెచ్చరించింది.

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా పలు ఆంక్షలు విధించడంతో ఈ వివాదం మొదలైంది. ఇంతకుముందే 30 శాతం సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు దానిని 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంధన సాంకేతికతతో సహా కీలకమైన తయారీ రంగాలకు అరుదైన ఖనిజాల అవసరం ఎంతో ఉంటుంది. ఈ ఈ ఖనిజాల ప్రపంచ ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది.

Trump

అయితే మాదకద్రవ్యాల బిజినెస్ కు మద్ధతుగా నిలుస్తోందన్న కారణాన్ని చూపుతూ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా జిన్‌పింగ్‌తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని సైతం రద్దు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ నిర్ణయాలపై తీవ్రంగా స్పందించిన డ్రాగన్ కంట్రీ దీనికి తమ రియాక్షన్ కూడా ఉంటుందని పేర్కొంది. ట్రంప్(Trump) తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లడం ఖాయమని హెచ్చరించింది. నిజానికి అమెరికా- చైనా మధ్య వాణిజ్య వివాదం చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఈ వివాదాలను పరిష్కరించుకునే క్రమంలో చర్చలు కూడా జరిగినా కొలిక్కి రాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లోనే ట్రంప్ మరోసారి చైనాపై సుంకాల బాంబు పేల్చడం సంచలనంగా మారింది. ట్రంప్ యాక్షన్ కు ధీటుగానే స్పందించిన చైనా రియాక్షన్ కు రెడీ ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చింది. రెండు అగ్రదేశాల మధ్య ఇలాంటి పరిణామాలు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజానికి ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు అమెరికాలోనే మద్ధతు కరువైంది. అయినప్పటకీ మొండిగా ముందుకెళుతూ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version