Trump: ట్రంప్ ఆంక్షలతో ఇళ్లకే పరిమితం.. భారత వలసదారుల పరిస్థితి ఘోరం

Trump: ఈ కొత్త రూల్స్ ను అక్కడి అధికారులు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు ముఖ్యంగా హెచ్-1బీ వీసాల విషయంలో ఎంతో లోతుగా పరిశీలిస్తున్నారు.

Trump

వలసదారులకు పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) అన్ని దేశాలపైనా ఆంక్షలు విధించేసారు. ఈ ఆంక్షలతో ఎక్కువగా ఇబ్బంది పడుతోంది మాత్రం ఇండియానే… ఎందుకంటే అమెరికాలో ఎక్కువమంది భారతీయులే ఉంటారు. అయితే వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారతీయ వలసదారులే కాదు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు కూడా తమ నివాసాల నుంచి బయటకు రావడం లేదు.

కొన్ని పనులు ఉన్న చుట్టుపక్కల దేశాలకు వెళ్లడం లేదు. గత కొన్ని నెలలుగా అమెరికా లోపలి ప్రయాణాలు భారీగా తగ్గుముఖం పట్టడమే దీనికి నిదర్శనం. అలాగే అక్కడ నుంచి పక్కదేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గింది. చాలా మంది గతంలో చేసుకున్న టికెట్లను సైతం రద్దు చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికా నుంచి బయటకు వెళ్లడం ఈజీనే.. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం టెన్షనే.. ఎందుకంటే అనుమతి పత్రాల్లో ఎంత చిన్న తప్పిదం లేదా లోపం ఉన్నా సరే ఇక ఎంట్రీ కష్టమే. వలసదారుల విషయంలో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త రూల్సే దీనికి కారణం.

Trump

ఈ కొత్త రూల్స్ ను అక్కడి అధికారులు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు ముఖ్యంగా హెచ్-1బీ వీసాల విషయంలో ఎంతో లోతుగా పరిశీలిస్తున్నారు. అందుకే చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకోవడమే మేలని భావించి అదే ఫాలో అవుతున్నారు. అంతే కాదు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నవారు సైతం బయట దేశం వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏ కారణం చెప్పి మళ్లీ అమెరికాలోకి అనుమతి నిరాకరిస్తారోనని భయపడుతున్నారు.

అమెరికాలో క్రిస్ మస్ , న్యూ ఇయర్ కారణంగా ప్రస్తుతం సెలవుల సీజన్ నడుస్తోంది. ప్రతీ ఏటా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ఈ సారి ఆ సందరి లేనే లేదు. ఎందుకంటే ప్రజలు వెళ్లే అన్ని మార్గాల్లోనూ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఈ సారి తాము ఉన్న చోటనే కొత్త ఏడాదికి స్వాగతం పలికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవిధంగా ట్రంప్ తెచ్చిన కొత్త రూల్స్ న్యూ ఇయర్్ వేడుకలపై గట్టి ఎఫెక్ట్ చూపించింది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version