Trump: ట్రంప్ మనసు మారిందా? అమెరికన్ ఎకానమీకి విదేశీ టాలెంట్ అత్యవసరమని తెలుసుకున్నారా?

Trump: తాజాగా ఒక ప్రముఖ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అధ్యక్షుడి ఆలోచనా విధానంలో కొంత ప్రాక్టికల్ మార్పు వచ్చినట్లు కనిపిస్తున్నాయి.

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తన వలస విధానంలో (Immigration Policy) కీలకమైన మార్పును సూచించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశీ ఉద్యోగులు ,హెచ్-1బీ వీసాలపై ట్రంప్ అనుసరించిన కఠిన వైఖరి అందరికీ తెలిసిందే.

టారిఫ్‌లు పెంచడం, వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్ల (దాదాపు రూ. 88 లక్షలు)కు పెంచి నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు ట్రంప్ తీసుకున్నారు. అయితే, తాజాగా ఒక ప్రముఖ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అధ్యక్షుడి ఆలోచనా విధానంలో కొంత ప్రాక్టికల్ మార్పు (Practical Shift) వచ్చినట్లు స్పష్టం చేస్తున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ (Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా శ్రామిక శక్తిలో (Workforce) కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం చాలా అవసరమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ అంగీకారం, ఆయన గతంలో అనుసరించిన కఠిన వైఖరికి పూర్తి విరుద్ధంగా ఉంది.

అమెరికాలో అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు (Talented Professionals) అందుబాటులో లేరని ట్రంప్ (Trump)పరోక్షంగా అంగీకరించారు. అమెరికాకు చెందిన ఉద్యోగులు, బయట నుంచి వచ్చే వారి దగ్గర ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆయన సూచించారు.

Trump

సరైన శిక్షణ లేని , దీర్ఘకాలికంగా నిరుద్యోగులుగా ఉన్న అమెరికన్ కార్మికులను తీసుకువచ్చి, తయారీ (Manufacturing) లేదా రక్షణ రంగాల్లోని ముఖ్యమైన టెక్నికల్ స్థానాల్లో నియమించుకోలేమని స్పష్టం చేశారు.

దక్షిణ కొరియా నుంచి వచ్చిన కార్మికులను ఉదాహరణగా చూపిస్తూ, బ్యాటరీలను తయారు చేయడంలో వారికి చాలా ప్రతిభ ఉంటుందని, అటువంటి పారిశ్రామిక రంగానికి స్పెషలైజ్డ్ స్కిల్స్ (Specialized Skills) అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా, విదేశాల నుంచి వచ్చిన నిపుణులు అమెరికన్ ఎకానమీకి ఎంత ముఖ్యమో ఆయన చెప్పకనే చెప్పారు.

అయితే విదేశీ ఉద్యోగుల పట్ల ట్రంప్ ధోరణిలో ఈ మార్పు రావడానికి అనేక కారణాలు ఉండొచ్చంటున్నారు నిపుణులు.

అమెరికన్ కార్మికుల వేతనాలు పెంచడానికి తాను మద్దతిస్తున్నా కూడా.. దేశంలో పారిశ్రామిక మరియు సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారని చెబుతున్నారు.

హెచ్-1బీ వీసాలపై కఠిన నిర్ణయాల కారణంగా అమెరికాలో టెక్ కంపెనీలు (Tech Companies), తయారీ సంస్థలు ప్రతిభ కొరత ఎదుర్కొన్నాయి. దీనిపై వ్యాపార వర్గాల నుంచి ట్రంప్‌కు వ్యతిరేకత పెరిగింది. ఈ వర్గాల మద్దతు పొందడం కోసం ఆయన తన వైఖరిని మార్చుకుని ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతేకాదు ఫ్యూచర్లో  విదేశీ నిపుణులతో పాటు, వారి కుటుంబ సభ్యులైన ప్రవాసుల (Immigrant Community) ఓట్లను కూడా ఆకర్షించడానికి ఈ సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తంగా, ట్రంప్ తీసుకున్న ఈ కొత్త వైఖరి భారతీయులతో సహా ఆ దేశంలోని మొత్తం ప్రవాసుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది కేవలం మాటలకే పరిమితమా, లేక భవిష్యత్తులో విధాన నిర్ణయాలలో ఈ సానుకూలత కనిపిస్తుందా అనేది వేచి చూడాలి. అయితే, అమెరికన్ ఎకానమీకి స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ ఎంత అవసరమో మాజీ అధ్యక్షుడు గుర్తించడం ఒక ముఖ్యమైన పరిణామం అన్న భావన అయితే అందిరిలో ఏర్పడింది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version