Graduates: డబ్బులిచ్చి ఆఫీసులకు వెళ్తున్న అక్కడి గ్రాడ్యుయేట్లు..

Graduates: అసలు ఉద్యోగమే లేకుండా, డబ్బులు చెల్లించి ఉద్యోగం చేస్తున్నట్లు గడుపుతారు.

Graduates

ఉదయం లేచామా, ఆఫీసుకెళ్లామా… రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేశామా… సాయంత్రం ఇంటికి వచ్చామా అన్నట్లుగానే ఇప్పుడు ఉద్యోగులు ఉంటున్నారు. చైనాలో కూడా అంతే .. కాకపోతే ఇక్కడే చిన్న మెలిక ఉంది. దీనికోసం దీనికి భిన్నమైన ఒక విచిత్రమైన జీవితం మొదలుపెడుతున్నారు అక్కడి యూత్.

అదేంటంటే.. అసలు ఉద్యోగమే లేకుండా, డబ్బులు చెల్లించి ఉద్యోగం చేస్తున్నట్లు గడుపుతారు. ఇప్పుడు ఈ విచిత్రమైన ట్రెండ్ అక్కడ బాగా ఊపందుకుంది. అయితే ఇది కేవలం సమయాన్ని గడపడానికో.. ఎవరినో మోసం చేయడానికో నడిపే వ్యవహారం కాదు.

నిరుద్యోగం అనే సామాజిక సమస్యకు ఇది అద్దం పడుతోండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అవును..చైనాలో యువత నిరుద్యోగం 14.5 శాతానికి చేరింది. ఎంతో కష్టపడి డిగ్రీలు(Graduates) పొందిన యువతకు ఉద్యోగాలు లభించకపోవడంతో ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు.

అలాంటి నిరుద్యోగుల కోసం ప్రిటెండ్ టు వర్క్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. ఇక్కడ, రోజుకు 30 నుంచి 50 యువాన్లు చెల్లించి, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మీటింగ్ రూమ్‌లు ఉన్న ఒక ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నట్లు నటించొచ్చు(pretend to work trend).దీనికీ ఓ కారణం ఉందంటున్నారు అక్కడి వారు.

డోంగువాన్ నగరానికి చెందిన షుయ్ జు .. 2024లో తన ఫుడ్ బిజినెస్ మూతపడిన తర్వాత, ఆయన ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఆఫీసుకి వెళ్తున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు కూడా అక్కడే పనిలేకపోయినా, పని చేస్తున్నట్లు నటిస్తున్నారు. మేము ఒకరికొకరు తోడుగా ఉంటున్నాం, కలిసి పనిచేస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన చెప్పడం ఈ ట్రెండ్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని తెలియజేస్తుంది.

ఈ ఆఫీసుల యజమానులు తమ సేవలను కేవలం వర్క్ స్టేషన్‌కు మాత్రమే పరిమితం చేయలేదు, పనిలేని వ్యక్తిగా ఉండటం అనే అవమానం నుంచి రక్షించే కేంద్రాలుగా వీటి గురించి చెబుతున్నారు.

చైనాలోని పెద్ద నగరాలైన షెన్‌జెన్, షాంఘైలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే వారిలో చాలామంది యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. తాము ఇంటర్న్‌షిప్ చేస్తున్నామని తమ ట్యూటర్లకు ఫోటోలు పంపించడానికి ఈ ఆఫీసులను వాడుకుంటున్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్(Graduates) పూర్తి అయిన వన్ ఇయర్ లోగా ఉద్యోగం చేయాలి. లేదంటే వారికి అవకాశాలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి.

Graduates

ఈ పరిస్థితిని గమనించిన న్యూజీలాండ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్టియన్ యావో.. ఈ విధానాన్ని చైనా యువతకు ఒక తాత్కాలిక పరిష్కారంగా దీనిని చెప్పారు. క్రిస్టియన్ యావో మాట్లాడుతూ, ఇలాంటి ప్రదేశాలు యువతకు తదుపరి ఏం చేయాలో ఆలోచించడానికి, తాత్కాలిక చిన్న ఉద్యోగాలు చేయడానికి ఉపయోగపడతాయని అన్నారు.

మొత్తంగా ఒకవైపు తమ నిరుద్యోగ రేటును తగ్గించడానికి చైనా(China) ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నా, ఇలాంటి ట్రెండ్‌లు ఆ దేశ సామాజిక, ఆర్థిక ఒత్తిడిని చెప్పకనే చెబుతున్నాయి.

Also Read: OTT: ఓ వైపు వరుస సెలవులు.. మరోవైపు ఓటీటీ బొనాంజా

Exit mobile version