AI pledges: ఏఐ మహా ప్రతిజ్ఞతో గిన్నిస్ రికార్డు ..అసలేంటీ ప్లెడ్జ్

AI pledges :నిజానికి ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, డీప్ ఫేక్ ,మిస్ ఇన్ఫర్మేషన్ వంటి ముప్పులు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి.

AI pledges

భారత్ మండపం వేదికగా ఢిల్లీలోని జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026.. ఒక అరుదైన ప్రపంచ రికార్డుకు సాక్ష్యంగా నిలిచింది. కేవలం 24 గంటల వ్యవధిలో అంటే ఫిబ్రవరి 16-17 మధ్య ఏకంగా 2,50,946 మంది ప్రజలు ఏఐ రెస్పాన్సిబిలిటీ ప్రతిజ్ఞ(AI pledges ) చేయడంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి లేటెస్ట్ టెక్నాలజీని సమాజ హితం కోసం, అత్యంత బాధ్యతాయుతంగా వినియోగిస్తామని ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ఇలా ముందుకు రావడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుత ఘట్టాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా వెల్లడించగా, దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ప్రవీణ్ పటేల్ ధ్రువీకరించారు. అసలు ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేశారు, దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటని ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది.

నిజానికి ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, డీప్ ఫేక్ ,మిస్ ఇన్ఫర్మేషన్ వంటి ముప్పులు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రతిజ్ఞ(AI pledges ) చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం..టెక్నాలజీని వాడేటప్పుడు నైతిక విలువలను పాటించడమే. అంటే, ఇతరులెవరినీ ఇబ్బంది పెట్టడానికి కాకుండా, అభివృద్ధి కోసం మాత్రమే ఏఐని వాడతామని పాతిక లక్షల మందికి పైగా పౌరులు కంకణం కట్టుకున్నారు.

దీనివల్ల ప్రపంచానికి భారత్ ఒక బలమైన సందేశాన్ని ఇచ్చినట్లు అయింది. మేము కేవలం టెక్నాలజీని సృష్టించేవాళ్లం మాత్రమే కాదు, దాన్ని వివేకంతో నియంత్రించగల బాధ్యతాయుతమైన సమాజమని నిరూపించింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారత ఏఐ వ్యవస్థ (AI Ecosystem) పై నమ్మకాన్ని పెంచుతుంది.

AI pledges

ఈ రికార్డు స్పెషాలిటీ ఏంటంటే.. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇప్పటివరకు ఏఐ నైతికతపై ఇంతపెద్దగా పబ్లిక్ క్యాంపెయిన్ నిర్వహించలేదు. ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, రాబోయే తరాలకు డిజిటల్ క్రమశిక్షణను నేర్పే ఒక గొప్ప పునాది. దీనివల్ల గ్లోబల్ టెక్ కంపెనీలు కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి మరింత ఆసక్తిని చూపిస్తాయి.

ఎందుకంటే ఇక్కడి ప్రజలు టెక్నాలజీ పట్ల అవగాహనతో పాటు బాధ్యతను కూడా కలిగి ఉన్నారని వారికి అర్థమవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, భారత్ సాధించిన ఈ రికార్డు ప్రపంచానికి ఏఐ ఎథిక్స్ (AI Ethics) లో దిక్సూచిగా నిలుస్తుంది. డిజిటల్ విప్లవంలో భారతదేశం కేవలం వేగంగానే కాదు, ఎంతో హుందాగా ముందుకు సాగుతోందని ఈ గిన్నిస్ రికార్డు మరోసారి చాటిచెప్పింది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version