Supreme Leader
స్వదేశంలో నిరసనలను ఉక్కుపాదంతో అణిచేస్తున్న ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బహిరంగంగా ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన అగ్రరాజ్యం మాటలకే పరిమితం కాకుండా చేతల్లోనూ దిగబోతోంది. యుద్ధ ట్యాంకర్లను మోహరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పరిస్థితిని ముందే అంచనా వేసిన ఇరాన్ మిలిటరీ సుప్రీం లీడర్ (Supreme Leader)అయతుల్లా అలీ ఖమేనీని అప్రమత్తం చేశారు.
ఫలితంగా ఖమేనీ బంకర్లలో దాక్కున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన్ని ఇరాన్ మిలిటిరీ టెహ్రాన్‌లోని ఓ బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ బంకర్ టెహ్రాన్‌లోని పలు సొరంగ మార్గాలకు అనుసంధానం చేయబడి ఉన్నట్లు సమాచారం. ఆయన చిన్న కొడుకు మసూద్ ఖమేనీ ఆయన రోజువారీ పనులను చూసుకుంటున్నట్లు అమెరికాకు కూడా నిఘావర్గాల సమాచారం అందింది.
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, జాతీయ కరెన్సీ రియాల్ పడిపోవడంతో ఇరాన్ లో నిరసనలో తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. చాలా చోట్ల అవి హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నిరసనలను అణిచివేసే చర్యల్లో 5 వేల మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో 4700 మంది వరకూ నిరసనకారులు, మిగిలిన వారు చిన్నారులు, నిరసనలకు సంబంధం లేని వారు కూడా కొందరు మృతి చెందినట్టు అక్కడి మీడియా పేర్కొంది.
నిరసనలకు అడ్డుకట్ట వేసే క్రమంలో భారీగా అరెస్టులు కూడా జరిగాయి. ఇప్పటి వరకూ దాదాపు 26 వేల మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఈ నిరసనలు, అరెస్టుల పర్వం, పలువురి మృతి వంటి పరిణామాలతో అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్ యుద్ధ నౌకల సమూహం మిడిల్ ఈస్ట్ వైపు వెళుతోందని చెప్పారు.
ఇరాన్‌పై చర్య తీసుకోవాలని తాను నిర్ణయించుకుంటే.. వెంటనే దాడులకు దిగేలా మోహరింపు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం తీవ్రంగానే ఉంది. అయితే అమెరికా వార్నింగ్ కు ఇరాన్ కూడా కౌంటర్ ఇచ్చింది. తమ సుప్రీం నాయకుడు (Supreme Leader) ఖమేనీ ఆదేసిస్తే అత్యాధునిక యుద్ధ సామాగ్రీతో అమలు చేయడానికి ఇరాన్ దళాలు రెడీగా ఉన్నాయి. అయినప్పటకీ వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తరహాలో తనను కూడా పట్టుకుంటారన్న ఉద్దేశంతోనే ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
Padma Shri :తెలుగు రాష్ట్రాలకు 11 పద్మ అవార్డులు.. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ
