earthquake: కుదిపేసిన భూకంపం..వైరల్ అవుతోన్న వీడియోలు

earthquake : పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉండటం వల్ల, కమ్చట్కా, కురిల్ దీవులు తరచుగా శక్తివంతమైన భూకంపాలకు గురవుతుంటాయి.

earthquake : భూమి మరోసారి తన ప్రకోపాన్ని చూపింది. రష్యాను కుదిపేసిన భారీ భూకంపం(రష్యాలోని కురిల్ ), 8.8 తీవ్రతతో నమోదై, పసిఫిక్ ప్రాంతంలో సునామీ భయాలను రేకెత్తించింది. ఈ ప్రకంపనల ధాటికి రష్యాలోని కురిల్ దీవులతో పాటు జపాన్ తీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

earthquake

రష్యాలోని కురిల్ దీవుల(Kuril Islands)లోని సెవెరో-కురిల్స్క్‌లో 3-4 మీటర్ల ఎత్తున సునామీ(Tsunami) అలలు విరుచుకుపడ్డాయి. ఈ పెను అలల ధాటికి తీర ప్రాంత భవనాలు నీట మునిగిపోయాయి, సెవెరో-కురిల్స్క్ పట్టణంలోని ఓడరేవు పూర్తిగా మునిగిపోయింది. జపాన్‌లోని హొక్కైడోలోని నెమురో హనసాకి ఓడరేవులో 30 సెం.మీ. (దాదాపు 1 అడుగు) ఎత్తులో మొదటి సునామీ అల నమోదైంది. హొక్కైడో తీరప్రాంతంలో ఉన్న అనేక గోదాములు సునామీ అలల తాకిడికి కొట్టుకుపోయాయి. ఇది 1952 తర్వాత కమ్చట్కా ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా నమోదైంది.

ఈ భారీ భూకంపం ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టించింది. హవాయి, అలాస్కా, అమెరికా పశ్చిమ తీరం, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈక్వెడార్, చిలీ, గ్వాటెమాల, కోస్టా రికా, పెరూ, మెక్సికో, ఇతర పసిఫిక్ దీవులకు తక్షణమే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవాయిలో తీరప్రాంతవాసులను ఎత్తైన ప్రాంతాలకు లేదా భవనాల 4వ అంతస్తుకు తరలివెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జపాన్‌లోనూ హొక్కైడో నుంచి ఒకినావా వరకు 900,000 మందికి పైగా ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయమని సూచించారు.

రష్యాకు ఇంతటి భారీ స్థాయి భూకంపాలు కొత్తేమీ కాదు. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉండటం వల్ల, కమ్చట్కా, కురిల్ దీవులు తరచుగా శక్తివంతమైన భూకంపాలకు గురవుతుంటాయి. ఈ ప్రాంతంలో 1952 నవంబర్ 4న సంభవించిన 9.0 తీవ్రతతో కూడిన భూకంపం చరిత్రలో నిలిచిపోయింది. ఇది కమ్చట్కా భూకంపంగా ప్రసిద్ధి చెందింది. ఈ భూకంపం వల్ల కమ్చట్కాలోని సెవెరో-కురిల్స్క్‌లో 15 మీటర్ల ఎత్తున సునామీ అలలు ఎగసిపడ్డాయి, ఇళ్లన్నీ కొట్టుకుపోయి దాదాపు 10,000 మందికి పైగా ప్రజలు మరణించారు. అప్పట్లో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైంది. రష్యాకు ఇది ఒక పెను విషాదాన్ని మిగిల్చింది.

 

Exit mobile version