Epstein
ప్రపంచ చరిత్రలోనే అత్యంత అతి హేయమైన సెక్స్ ట్రాఫికింగ్ కేసుగా పిలుస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్(Epstein) వ్యవహారం ..మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ వల్ల.. జనవరి 2026లో ఏకంగా 35 లక్షల పేజీల డాక్యుమెంట్లు, వేల సంఖ్యలో వీడియోలు బయటకు వచ్చాయి.
అయితే ఈ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పేరు వెయ్యికి పైగా సార్లు కనిపించడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ డాక్యుమెంట్లలో ఏముంది.. ట్రంప్ దీనిని ఎలా ఫేస్ చేయబోతున్నారన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది.
లోలిటా ఎక్స్‌ప్రెస్- ఫ్లైట్ లాగ్స్ మిస్టరీ.. ఎప్‌స్టీన్ తన లోలిటా ఎక్స్‌ప్రెస్ అనే ప్రైవేట్ జెట్‌లో అమెరికాలోని.. ప్రముఖులను తన సొంత దీవి అయిన లిటిల్ సెయింట్ జేమ్స్‌కు తీసుకెళ్లేవాడు. తాజాగా బయటపడిన డాక్యుమెంట్లలో ఉన్నదాని ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ఈ విమానంలో 7 నుంచి 8 సార్లు ప్రయాణించినట్లు తేలింది.
ఇవన్నీ కూడా 1993 – 1996 మధ్య కాలంలో కేవలం న్యూయార్క్ నుంచి పామ్ బీచ్ మధ్య జరిగిన ప్రయాణాలు మాత్రమేనని ఫైల్స్ చెబుతున్నాయి. అదే సమయంలో బిల్ క్లింటన్ ఏకంగా 26 సార్లు ఆ విమానంలో ప్రయాణించగా, అందులో కొన్ని ట్రిప్పులు ఎప్‌స్టీన్ దీవికి కూడా వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇటు ట్రంప్ మాత్రం తాను ఎప్పుడూ ఆ దీవికి వెళ్లలేదని, ఆహ్వానించినా తిరస్కరించానని చెబుతున్నారు.
వైరల్ అవుతున్న పాత స్నేహం.. కొత్త వివాదాలు.. 1980 నుంచి 90వ దశకాల్లో ట్రంప్ , ఎప్‌స్టీన్ మంచి స్నేహితులు. 2002లో ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్వయంగా ఎప్‌స్టీన్ అద్భుతమైన వ్యక్తి, అందమైన అమ్మాయిలను ఇష్టపడతాడని..అందులోనూ కాస్త చిన్న వయస్సు వారిని మరీ ఎక్కువగా ఇష్టపడతాడని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రంప్‌ను నీడలా వెంటాడుతున్నాయి.
అయితే 2004లో ఒక రియల్ ఎస్టేట్ వివాదం ట్రంప్, ఎప్‌స్టీన్ మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాతే ట్రంప్ అతడిని తన మార్-అ-లాగో క్లబ్ నుంచి బహిష్కరించారని ఆధారాలు చూపిస్తున్నాయి.
అసలు ఎవరీ జెఫ్రీ ఎప్‌స్టీన్ అంటే అతనొక ఒక అమెరికన్ ఫైనాన్షియర్. తన క్లయింట్ల కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులను మేనేజ్ చేసేవాడు. కానీ అతని అసలు ముఖం మరొకటి ఉందన్న విషయం ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్, ఫ్లోరిడా , తన సొంత దీవిలో వందలాది మంది మైనర్ బాలికలను ప్రలోభపెట్టి, వారికి డబ్బు ఆశ చూపి తన వలలో వేసుకునేవాడు.
ఎప్‌స్టీన్(Epstein)కు సొంతంగా ఒక విమానం కూడా ఉండేది, దానిని స్థానికులు ‘లోలిటా ఎక్స్‌ప్రెస్’ అని పిలిచేవారు. అందులో ఆ బాలికలను, ప్రపంచంలోని అతిపెద్ద సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను తన ప్రైవేట్ దీవి అయిన ..లిటిల్ సెయింట్ జేమ్సకు తీసుకెళ్లేవాడు.
అక్కడ సకల సౌకర్యాలతో ఒక విలాసవంతమైన భవనం, భారీ మందిరం ఉండేవి. అయితే ఆ దీవికి వెళ్లేవారంతా ప్రపంచం గర్వించే స్థాయి వ్యక్తులే కావడంతో, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు.
2005లో ఒక 14 ఏళ్ల బాలిక ఎప్‌స్టీన్(Epstein)పై తొలిసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి విచారణలో ఎప్‌స్టీన్ తన వద్దకు వచ్చిన అమ్మాయిలకు కొన్ని వందల డాలర్లు ఇచ్చి, మళ్లీ వేరే అమ్మాయిలను కూడా తీసుకురావాల్సిందిగా వారిని ప్రోత్సహించేవాడు. ఒక అమ్మాయిని రిక్రూట్ చేసుకోవడానికి ఆ అమ్మాయికి అదనపు కమిషన్ కూడా ఇచ్చేవాడు.
ఇలా ఎప్‌స్టీన్(Epstein) ఒక భారీ సెక్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను నడిపాడు.అక్కడ ప్రపంచం గర్వించే స్థాయిలో ఉన్న ఎంతోమంది వ్యక్తులు మైనర్ అమ్మాయిల దగ్గర చిల్లర వేషాలు, వికృత చేష్టలు చేసినవారేనన్న ఫోటోలు , వీడియోలు బయటపడటంతో అంతా షాక్ అవుతున్నారు.
అయితే 2019లో ఎప్‌స్టీన్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. కానీ అదే ఏడాది ఆగస్టులో న్యూయార్క్ జైలులో అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినా కూడా, అతనికి ఎవరితో లింకులు ఉన్నాయో అన్న విషయాలు ఎక్కడ బయటపడతాయో అని ఎవరో చంపేశారనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.
కానీ అతను చనిపోయినా, అతను మెయింటైన్ చేసిన డైరీలు, ఫైల్స్ ద్వారా ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తూ ప్రపంచ సెలబ్రెటీల గుట్టును రట్టు చేస్తున్నాయి.
కాగా ఈ చీకటి వ్యవహారంలో ఎప్‌స్టీన్ ప్రియురాలు అయిన గిస్లేన్ మాక్స్‌వెల్ పాత్ర కూడా చాలా కీలకం.మైనర్ అమ్మాయిలను గుర్తించి, వారిని ఎప్‌స్టీన్ వద్దకు చేర్చడంలో ఆమే ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం ఆమె 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తోంది.
మరోవైపు ఒకవేళ ఇప్పుడు విడుదలైన 35 లక్షల పేజీలలో కానీ వేల సంఖ్యలో ఉన్న వీడియోలలో కానీ ట్రంప్ ఏదైనా నేరం చేసినట్లు రుజువైతే, అది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా, నీచమైన చర్యగా నిలిచిపోతుంది.
ముందుగా, ఆయనపై ‘ఇంపీచ్‌మెంట్’ అంటే పదవి నుంచి తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. దీంతో ఇప్పటికే చీలిపోయి ఉన్న అమెరికా సమాజం మరింత అల్లకల్లోలం అయ్యే అవకాశం ఉంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ..ఇలాంటి దురదృష్టకరమైన, హేయమైన కేసులో ఇరుక్కుంటే డాలర్ విలువ పడిపోవడం నుంచి స్టాక్ మార్కెట్లు కూలిపోవడం వరకు భారీ ఆర్థిక నష్టమే వాటిల్లుతుంది. అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న వారందరికీ కూడా ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుంది.
ప్రస్తుతానికి ట్రంప్ ఎప్‌స్టీన్ కేసును తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తానే స్వయంగా ఈ ఫైల్స్ రిలీజ్ చేశాను కాబట్టి తన దగ్గర దాచడానికి ఏమీ లేదని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో తన అటార్నీ జనరల్ ద్వారా ఇతర ప్రముఖులపై ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చి, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్… ఐపీఎల్..ఫ్యాన్స్ కు నాన్ స్టాప్ ధనాధన్
