Imran Khan:రంగంలోకి ఐక్యరాజ్య సమితి.. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేనా?

Imran Khan: యునైటెడ్ నేషన్స్ స్పెషల్ సెల్ రాపోర్ట్యూర్ అయిన అలైస్ జిల్ ఎడ్వర్డ్స్ పాక్ ప్రభుత్వానికి ఇచ్చిన పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది.

Imran Khan

యునైటెడ్ నేషన్స్ స్పెషల్ సెల్ రాపోర్ట్యూర్ అయిన అలైస్ జిల్ ఎడ్వర్డ్స్ పాక్ ప్రభుత్వానికి ఇచ్చిన పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది.Imran Khan రెండేళ్లుగా పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) వ్యవహారం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి (United Nations) వరకు చేరింది. ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో చిత్రహింసలు పెడుతున్నారని ఇప్పటికే అనేక ఆరోపణలు రాగా, గత నెలలో ఆయనను చంపేశారనే ప్రచారం కూడా సాగింది. అయితే, ఆయన తోబుట్టువులు జైల్లో ఇమ్రాన్‌ని చూసి వచ్చిన తర్వాత ఆ ప్రచారం ఆగిపోయింది.

మాజీ భార్య జెమీమా ఆవేదన..తాజాగా ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా (Jemima) ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌పై చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇమ్రాన్ గురించి తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని, తన ఖాతాలో ఉన్న ‘విజిబిలిటీ ఫిల్టరింగ్‌’ను సరిచేయాలని ఆమె ఎలాన్ మస్క్‌కు (Elon Musk) బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.

Imran Khan

చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉన్న తమ తండ్రిని చూసేందుకు, మాట్లాడేందుకు మా కుమారులకు అనుమతి లేదు. కేవలం ఎక్స్ ద్వారా మాత్రమే ఇమ్రాన్ పరిస్థితిని ప్రపంచానికి చెప్పగలం” అని జెమీమా తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత సున్నితమైన రాజకీయ అంశంపై, తన బిడ్డల తరఫున ఆమె చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐక్యరాజ్య సమితి జోక్యం..ఇదే సమయంలో యునైటెడ్ నేషన్స్ స్పెషల్ సెల్ రాపోర్ట్యూర్ (United Nations Special Cell Rapporteur) అయిన అలైస్ జిల్ ఎడ్వర్డ్స్ (Alice Jill Edwards) పాక్ ప్రభుత్వానికి ఇచ్చిన పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. సాలిటరీ సెల్‌లో (Solitary Cell) ఇమ్రాన్ ఖాన్‌ని బంధించడం తగదని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆమె గుర్తు చేశారు.

Imran Khan

15 రోజులకి మించి ఇలా సాలిటరీ సెల్‌లో ఉంచడమంటేనే అది అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన (International Human Rights Violation) అవుతుందని, దాదాపు రెండేళ్లుగా ఇలా ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. వీలైనంత త్వరగా ఈ నరకం నుంచి ఇమ్రాన్ ఖాన్‌ని బయటకి తీసుకురావాలని ఆమె పాకిస్థాన్ ప్రభుత్వానికి సూచించారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్(Imran Khan) విషయంలో పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version