Parents:తల్లిదండ్రులకు కళ్లు తెరిపించే పాఠం ఇది..మీ జీవితంలోనూ ఇదే ఫాలో అవ్వండి..

Parents: పిల్లలను ప్రేమించండి, కానీ మీ జీవితాన్ని పూర్తిగా వారి చేతుల్లో పూర్తిగా పెట్టకండి.

Parents

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మాట అక్షరాలా నిజం. అమ్మా- కొడుకు, అన్నా- తమ్ముడు, అక్కా- చెల్లి , భార్యా-భర్త ఇలా అది ఎలాంటి రిలేషన్ అయినా డబ్బు చుట్టూనే తిరుగుతుందనేది అక్షర సత్యం. దీని అతి పెద్ద ఎగ్జాంపుల్.. రేమండ్స్ అధినేత విజయ్‌పథ్ సింఘానియా జీవితగాథ.

దేశంలోనే అతిపెద్ద వస్త్ర సామ్రాజ్యం అయిన రేమండ్స్‌ను నిర్మించిన విజయ్‌పథ్ సింఘానియా కథ వింటే..ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. ఒకప్పుడు వేల కోట్ల ఆస్తులు, 36 అంతస్థుల భవనం, విలాసవంతమైన జీవితం ఉన్న వ్యక్తి.. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండటం, తన కనీస అవసరాల కోసం కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితికి చేరుకున్నారంటే ఆయన జీవితంలో ఏం కోల్పోయారో అర్ధం చేసుకోవచ్చు.

విజయ్‌పథ్ సింఘానియాకు తన కొడుకు గౌతమ్ సింఘానియా అంటే పిచ్చి ప్రేమ. ఆ మితిమీరిన ప్రేమతోనే సుమారు 1041 కోట్ల రూపాయల విలువైన కంపెనీ షేర్లు , ఆస్తులను తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా కొడకుకు రాసిచ్చారు. కానీ ఆస్తి మొత్తం చేతికి వచ్చిన తర్వాత, ఆ కొడుకు తండ్రిని కనికరం లేకుండా ఇంటి నుంచి గెంటేశాడు. చివరకు కారు, డ్రైవర్ సౌకర్యం కూడా లేకుండా చేశాడు. దీంతో ఇప్పుడు 80 ఏళ్ల వయసులో ఆ వృద్ధుడు తన సొంత ఆస్తి కోసం కొడుకుతో పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.

అందుకే ఈ కథ ప్రతీ ఒక్కరికీ ముఖ్యంగా తల్లిదండ్రులకు(Parents) ఇది ఒక గుణపాఠం. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే.. పిల్లలను ప్రేమించండి, కానీ మీ జీవితాన్ని పూర్తిగా వారి చేతుల్లో పూర్తిగా పెట్టకండి.

Parents

ప్రతీ ఒక్కరికీ ఆర్థిక భద్రత ఉండాలి. అంటే మీ ప్రాణం ఉన్నంత వరకు మీకంటూ కొంత ఆస్తిని, నగదును సొంతంగా ఉంచుకోవాలి.
పిల్లలపై ప్రేమ పెంచుకోండి కానీ గుడ్డి ప్రేమ వద్దు. పిల్లలకు ఆస్తుల కంటే విలువలు నేర్పడం ముఖ్యం అన్న సంగతి తెలుసుకోండి.

మనుషుల మనస్తత్వాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆస్తుల బదిలీ విషయంలో తల్లిదండ్రులు(Parents) పిల్లలకు తమ ఆస్తులను ముందే బదిలీ చేయకండి.

ఎందుకంటే మనం కళ్లు తెరిచి చూస్తే మన చుట్టూనే ఎంతోమంది విజయ్‌పథ్ సింఘానియాలు దీనంగా కనిపిస్తూనే ఉంటారు. డబ్బు మాయలో పడి కన్నవారినే కాదనుకునే ఇలాంటి ఘటనలు ఎన్నో అత్యంత దైన్యంగా అడుగడుగునా పలకరిస్తూనే ఉంటాయి.

World Cup: కివీస్‌ను కుర్రాళ్లూ కొట్టేశారు..అండర్ 19 వరల్డ్ కప్

Exit mobile version