Ulavacharu
తెలుగు వారి విందు భోజనంలో ఉలవచారు (Ulavacharu) ఉంటే ఆ మజానే వేరు అంటారు ఫుడ్ లవర్స్. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉలవచారుకి ఉన్న క్రేజ్ గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది కేవలం ఒక చారు మాత్రమే కాదు, గంటల తరబడి ఓపికగా వండే ఒక కళ అంటారు రెసిపీ తెలిసినవాళ్లు.
నిజమే ఉలవచారు రుచిగా రావాలంటే ఒక రహస్యం ఉంటుందట. ఉలవచారును (Ulavacharu) మరిగించడం వల్లే దానికి అంత రుచి వస్తుందంటారు. దీనిని ఎలా చేయాలంటే.. ఉలవలను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు కుక్కర్‌లో కనీసం 10-12 విజిల్స్ వచ్చే వరకు అయినా ఉడికించాలి. ఆ ఉడికించిన నీటిని వడకట్టి వచ్చిన ఉలవ కట్టుని చిక్కబడే వరకు సన్నని మంట మీద మరిగించాలి.
అందులో చింతపండు రసం, ఉప్పు, కారం , ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించి చేసిన ప్రత్యేక మసాలా పొడిని వేయాలి. ఈ చారు ఎంత మరిగితే అంత చిక్కదనం, అంత రుచి వస్తుంది. చివరగా ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకుతో నెయ్యి పోపు వేస్తే వచ్చే సువాసన చుట్టు పక్కల ఇళ్ల వారికీ వ్యాపిస్తుంది.
ఉలవలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఉలవలు శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగిస్తాయి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఉలవచారు ఒక మందులా పనిచేస్తుందట. వేడి వేడి అన్నంలో ఉలవచారు, ( Ulavacharu )పైన కొంచెం గడ్డ పెరుగు లేదా మీగడ వేసుకుని తింటే ఆ రుచిని మాటల్లో వర్ణించలేమంటారు ఉలవచారు ప్రియులు.
Shreyas Iyer: శ్రేయాస్ హిట్..గిల్ ఫ్లాప్… విజయ్ హజారే ట్రోఫీ రౌండప్
