Habits: 30 ఏళ్లు వచ్చాయా? అయితే ఈ 5 అలవాట్లకు గుడ్ బై చెప్పండి..!

Habits: కొన్ని అలవాట్లను మార్చుకుంటే, మీరు విజయవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చంటున్నారు నిపుణులు.

Habits

మీ వయస్సు 30 ఏళ్లు దాటిందా? అయితే మీ జీవితాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చినట్లే. చాలామందికి మూడు పదుల వయసులోకి అడుగుపెట్టాక జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. కానీ కొంతమంది మాత్రం ఇంకా ఇరవైల వయసులో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడి, ఎన్నో అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని అలవాట్ల(Habits)ను మార్చుకుంటే, మీరు విజయవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్మించుకోవచ్చంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఆరోగ్యకరమైన ఆహారం(Habits) తీసుకోండి. యవ్వనంలో మనం ఏది తిన్నా మన జీర్ణ వ్యవస్థ అంతగా ప్రభావితం కాదు. కానీ 30 ఏళ్ల తర్వాత శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాబట్టి, పోషక విలువలు లేని ఆహారం, ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు, ఉదర సంబంధిత సమస్యలను నివారించొచ్చు.

Habits

ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. ఇరవైల్లో ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడినా, మీ శరీరం సహకరిస్తుంది. కానీ 30 దాటాక శరీరంలో జీవక్రియల వేగం తగ్గుతుంది. దీనివల్ల సులభంగా రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఆరోగ్యాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా యోగా, వ్యాయామం వంటి వాటిని మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మీలో సానుకూల దృక్పథాన్ని కూడా పెంచుతుంది.

మిడ్ నైట్ పార్టీలకు దూరంగా ఉండండి.. పార్టీలు, పబ్బులు, నైట్ క్లబ్‌లు నేటి యువతకు ఒక అలవాటుగా మారిపోయాయి. సందర్భం ఉన్నా, లేకపోయినా పార్టీలకు వెళ్లడం సాధారణంగా మారింది. కానీ ఇదే పనిగా పార్టీలతో జీవితాన్ని గడిపితే, జీవితంపై సీరియస్‌నెస్ కోల్పోతారు. ఇది కెరీర్‌పై ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.

మద్యపానానికి దూరంగా ఉండండి.. టీనేజీలో, ఇరవైల వయసులో మద్యపానం ఒక ఫ్యాషన్‌గా మారవచ్చు. కానీ ఇది 30 ఏళ్ల తర్వాత కొత్త సమస్యలను తెస్తుంది. దీర్ఘకాలంగా తాగే అలవాటు ఉంటే, అది కుటుంబ కలహాలు, ఉద్యోగంలో ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే, 30 ఏళ్లు రాకముందే ఈ అలవాటును నియంత్రించుకోవాలి.

ఓవర్ స్పీడ్‌కు బ్రేక్ వేయండి..బైక్, కారు వేగంగా నడపడం ఒక సరదాగా అనిపించవచ్చు. అయితే, 30 ఏళ్లు దాటాక కూడా అతివేగంగా వాహనాలు నడిపితే అది మానసిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కెరీర్, కుటుంబ విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. మీ భవిష్యత్తు కోసం మీరు బాధ్యతగా ఉండాలి. ఈ మార్పులను అలవాటు చేసుకుంటే.. 30 ఏళ్ల తర్వాత మీ జీవితాన్ని మరింత సురక్షితంగా, విజయవంతంగా మారుస్తాయి.

Ragging: ర్యాగింగ్ పేరుతో ఐరెన్ బాక్సుతో కాల్చిన తోటి విద్యార్ధులు..చట్టం ఏం చేస్తుంది..?

Exit mobile version