breakfast : మీరూ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే బ్యాచేనా..అయితే ఇది మీకోసమే

breakfast : ఒకటి, రెండు రోజులు ఫర్వాలేదు కానీ, ఇదే అలవాటుగా మారితే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

breakfast : చాలామంది ఉదయం పూట హడావుడిగా గడిపేస్తుంటారు. సమయం చాలక, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ తినకుండానే పనుల్లో పడిపోవడం చూస్తుంటాం. ఒకటి, రెండు రోజులు ఫర్వాలేదు కానీ, ఇదే అలవాటుగా మారితే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మన పెద్దలు చెప్పినట్లు, రోజుకు మూడు పూటలా మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం.పొద్దున బ్రేక్‌ఫాస్ట్(breakfast) మానేస్తే.. బాడీలో డేంజర్ బెల్స్ మోగినట్లేనని అంటున్నారు. ఖాళీ కడుపుతో రోజును మొదలుపెడితే ఎన్నో ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.

breakfast

కడుపులో సమస్యలు: చాలాసేపు ఆహారం తీసుకోకపోతే కడుపులో యాసిడ్స్ ఎక్కువై ఎసిడిటీ, గ్యాస్ లాంటివి వస్తాయి. కడుపు ఉబ్బరం, నొప్పి, యాసిడ్ పైకి రావడం వంటి బాధలు పడాల్సి వస్తుంది. పేగుల పనితీరు కూడా సరిగా ఉండదు.

నీర్సం, ఏకాగ్రత తగ్గడం: రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరానికి ఉదయం శక్తి చాలా అవసరం. బ్రేక్‌ఫాస్ట్ లేకపోతే ఆ శక్తి అందదు. దీంతో పనులు చేయడానికి బద్ధకంగా అనిపిస్తుంది. కోపం, చికాకు పెరుగుతాయి. రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గి, మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. ఇది ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, చేసే పనిలో నాణ్యత తగ్గుతుంది అని నిపుణులు అంటున్నారు.

మానసిక ఒత్తిడి: న్యూరాలజీ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా పరిశోధకుల ప్రకారం, రోజూ బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, తరచుగా తలనొప్పి (మైగ్రేన్) వంటివి రావొచ్చు. మెదడుకు కావాల్సిన పోషకాలు అందకపోతే జ్ఞాపకశక్తి తగ్గడం, ఆందోళనలు మొదలయ్యే ప్రమాదం ఉంది.

బరువు పెరగడం: బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్ మానేసేవారు ఉంటారు. కానీ ఇది పొరపాటు. ఉదయం తినకపోతే, ఆకలి ఎక్కువగా వేసి మధ్యాహ్నం, రాత్రి ఎక్కువ తింటారు. దీనివల్ల శరీరం శక్తిని కొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా, బరువు పెరిగి ఊబకాయం సమస్య వస్తుంది.

ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలంటే, పోషకాలున్న అల్పాహారం తప్పనిసరి. అంతేకాకుండా, మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయపు భోజనం మన రోజుకు సరైన ఆరంభం అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

 

 

Exit mobile version