Life: మీకు నచ్చని జీవితాన్ని గడుపుతున్నారా? మీ జీవితాన్ని మార్చుకోలేకపోవడానికి అసలు కారణం ఇదే!

Life: మన సమాజం మనకు చిన్నప్పటి నుంచి నేర్పిన "సేఫ్టీ" అనే సూత్రం మనల్ని రిస్క్ తీసుకోకుండా అడ్డుకుంటుంది.

Life

నాకు ఈ లైఫ్ (Life )నచ్చడం లేదు, ఈ ఉద్యోగం నచ్చడం లేదు, ఈ రిలేషన్ నచ్చడం లేదు అని అనుకునే వాళ్లు కోకొల్లలు. కానీ దాన్ని మార్చడానికి ధైర్యం చేసే వాళ్లు మాత్రం చాలా తక్కువ. మనకు నచ్చని జీవితాన్ని మనం ఒక్క రోజులో ఎంచుకోలేదు, అది మన భయాలు , పాత అలవాట్ల వల్ల మెల్లగా తయారవుతుంది.

మార్పు అంటే మనిషికి సహజంగానే ఒక భయం ఉంటుంది. ఇప్పుడున్న జీవితం(Life) నచ్చకపోయినా అది మనకు తెలిసిన బాధ, కానీ మార్పు అనేది తెలియని దారి. ఆ కొత్త దారిలో ఏముందో, అక్కడ ఏ ప్రమాదాలు ఉన్నాయో అనే భయం మనల్ని కట్టిపడేస్తుంది. అందుకే చాలామంది నచ్చని జీవితంలోనే ఏడుస్తూ బతుకుతారు తప్ప, కొత్త అడుగు వేయడానికి సాహసించరు. మన సమాజం మనకు చిన్నప్పటి నుంచి నేర్పిన “సేఫ్టీ” అనే సూత్రం మనల్ని రిస్క్ తీసుకోకుండా అడ్డుకుంటుంది.

మరో కారణం ఇతరుల అంచనాలు. మన తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న వాళ్లు మనల్ని ఒక రకంగా చూడాలనుకుంటారు. వాళ్లని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో మనకు నచ్చకపోయినా అదే జీవితా(Life)న్ని కొనసాగిస్తాం. మన ఇష్టాల కంటే పక్కవాళ్ళ అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇస్తాం. దీనివల్ల లోపల అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది.

Life

అలాగే బాధ్యతలు అనేవి మన కళ్లకు గంతలు కడతాయి, కాళ్లకు బంధాలు వేస్తాయి. నాకు పిల్లలు ఉన్నారు, అప్పులు ఉన్నాయి.. ఇప్పుడు నేను ఈ పని వదిలేస్తే ఎలా? అనే ఆలోచనలు మనల్ని బానిసలుగా మారుస్తాయి. కానీ నిజానికి మనం చేయగలిగిన చిన్న చిన్న మార్పులను కూడా మనం గమనించం. మార్పు అనేది ఒకేసారి రాదు.

మనం రోజులో చేసే చిన్న పనులు మార్చుకుంటేనే పెద్ద మార్పుకు అది పునాది అవుతుంది. అలవాటు పడిపోవడం అనేది మన మనసుకి ఉండే అతిపెద్ద బలహీనత. ఆ అలవాటు నుంచి బయటకి రావాలంటే ముందు మన భయాన్ని మనం ఒప్పుకోవాలి. జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, కానీ దాన్ని మార్చుకునే తాళం చెవి మన దగ్గరే ఉందని మనం మర్చిపోతాం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version