Blood donation
రక్తదానం(Blood donation).. పదిమందికి ప్రాణం పోస్తుంది. కానీ ఒక్కోసారి నిర్లక్ష్యం వల్ల అదే ప్రాణం మీదకు తెస్తుంది. ప్రాణాలను రక్షించే క్రమంలో జరిగే పొరపాట్లు, సరైన పరీక్షలు చేయకపోవడం వల్ల రక్తమార్పిడి చేయించుకునే వారికి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రక్తదానం చేసేటప్పుడు, స్వీకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం.
కొంతకాలం క్రితం కాన్పూర్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన దీనికి ఒక ఉదాహరణ. రక్తం మార్పిడి చేయించుకున్న 14 మంది తలసేమియా బాధితులైన చిన్నారులకు HIV, హెపటైటిస్ B, C వంటి ప్రాణాంతక వ్యాధులు సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ పిల్లలంతా తలసేమియా వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ, రక్తమార్పిడిపై ఆధారపడినవారు. అయితే, రక్తదానం చేసిన దాతల రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అప్పట్లో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ, రక్తం దానం(Blood donation) చేసిన వెంటనే కొన్ని పరీక్షలు చేస్తామని, అయితే ఆ సమయంలో విండో పీరియడ్ అని పిలిచే ఒక దశ ఉంటుంది. ఈ సమయంలో ఒక వ్యక్తి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ, అది పరీక్షల్లో బయటపడదని, ఆ దశలోనే పిల్లలకు రక్తం మార్పిడి జరిగిందని తెలిపారు. అయితే, వైద్య నిపుణులు మాత్రం రక్తమార్పిడి సమయంలో హెపటైటిస్ B వ్యాక్సిన్ ఇవ్వడం తప్పనిసరి అని, కానీ ఈ విషయంలో వైద్యులు ఆ నిబంధనను పాటించలేదని అభిప్రాయపడ్డారు.
ఈ సంఘటన బ్లడ్ బ్యాంక్ వ్యవస్థలో ఉన్న లోపాలను, రక్తదానం(Blood donation) చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పష్టంగా తెలియజేస్తుంది. రక్తాన్ని దానం చేసిన వెంటనే దాన్ని ఉపయోగించకుండా, దానిలోని అన్ని వైరస్‌లను నిర్ధారించడానికి కచ్చితమైన పరీక్షలు చేయాలి. అలాగే, దాతల నుంచి సమాచారం సేకరించేటప్పుడు వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా రక్తమార్పిడి చేయించుకునే రోగులకు, ముఖ్యంగా పిల్లలకు హెపటైటిస్ వంటి వ్యాధులకు టీకాలు వేయించడం తప్పనిసరి.
రక్తదానం (Blood donation) ఒక గొప్ప సేవ. కానీ దానిని పూర్తి అవగాహనతో, బాధ్యతతో చేస్తేనే ప్రాణాలను రక్షించగలం. తప్పులు జరిగితే అది ప్రాణాంతకం కావచ్చని ఈ ఘటన గుర్తు చేస్తుంది. అందుకే రక్తదానం చేసేటప్పుడు, అందుకు సంబంధించిన ప్రక్రియల పట్ల ప్రజలకు, వైద్య సిబ్బందికి పూర్తి అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం.
Also Read: Analysis :బ్రిక్స్, SCO వేదికగా అమెరికాకు సవాలు..భారత్ విదేశాంగ విధానంపై విశ్లేషణ