Eat food: మీరు ఫుడ్ చేతితో తింటారా? స్పూన్‌తో తింటారా? ఈ ప్రశ్న ఎందుకంటే..

Eat food :స్టైలిష్‌గా ఉంటుందని, శుభ్రంగా ఉంటుందని చాలామంది స్పూన్, ఫోర్క్‌లను వాడుతుంటారు.

Eat food

టీవీ చూస్తూనో, ఫోన్ పట్టుకునో, లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూనో స్పూన్‌తో వేగంగా భోజనం(Eat food) చేసే అలవాటు ఉంటుంది చాలామందికి. అలాగే స్టైలిష్‌గా ఉంటుందని, శుభ్రంగా ఉంటుందని చాలామంది స్పూన్, ఫోర్క్‌లను వాడుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ అలవాటు అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

నిజానికి, మన చేతులతో తినడమే మన ఆరోగ్యానికి అత్యంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చేత్తో తినడం వల్ల మన ఆహారంపై పూర్తి ఏకాగ్రత (mindful eating) ఏర్పడుతుంది. మనం ఎంత తింటున్నాం, మన కడుపు ఎంత నిండింది అనే స్పృహ మనకు కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ తినకుండా ఉంటాం, తద్వారా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చట.

Eat Food

అంతేకాకుండా, స్పూన్‌తో వేగంగా తినేవారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఎందుకంటే, వేగంగా తినడం (Eat food)వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ లో తేడా వస్తుంది. అదే చేత్తో తింటే, ఆహారాన్ని నెమ్మదిగా నములుతూ తింటాం కాబట్టి జీర్ణక్రియ సులభమవుతుంది. అరుగుదల సమస్యలు కూడా తగ్గుతాయి. మనం చేతితో ఆహారాన్ని ముట్టుకున్నప్పుడు, తినడానికి సిద్ధమవుతున్నామని మెదడు కడుపుకి సిగ్నల్స్ పంపుతుంది. ఈ సిగ్నల్స్ జీర్ణక్రియ ఎంజైమ్‌లను విడుదల చేసి, ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. కానీ స్పూన్‌తో తిన్నప్పుడు ఈ సిగ్నల్స్ సరిగా వెళ్లవు.

Eat Food

దీనితో పాటు, మన చేతివేళ్లపై ఉండే ‘నార్మల్ ఫ్లోరా’ అనే సహజసిద్ధమైన బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన శరీరంలోకి బయట నుంచి వచ్చే హానికరమైన బ్యాక్టీరియాలను అడ్డుకుంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా గొంతు, నోరు, చిన్న ప్రేగుల్లో వృద్ధి చెందడం చాలా అవసరం. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు, మన చేతితో ఆహారం తింటే చాలు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్పూన్, ఫోర్క్‌లతో తిన్నప్పుడు ఆహారం ఎంత వేడిగా, ఎంత చల్లగా ఉందో మనకు వెంటనే తెలియదు. కానీ చేత్తో ముట్టుకుంటే ఆ వేడిని మనం వెంటనే గుర్తించవచ్చు, తద్వారా నాలుక కాలకుండా కాపాడుకోవచ్చు. చేత్తో పట్టుకోవడం వల్ల ఆహారం(Eat food) యొక్క నాణ్యత, పరిశుభ్రత కూడా తెలుస్తాయి, దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. మొత్తం మీద, చేతితో తినడం అనేది మన శరీరానికి ఒక చిన్నపాటి వ్యాయామంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటును మనం కొనసాగించడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని వారి సలహా.

 

Exit mobile version