Alcohol
ఆల్కహల్… ఇప్పుడు చాలామంది యువత జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడానికైనా, పార్టీ చేసుకోవడానికైనా, చిన్న ఫంక్షన్స్‌కైనా ఆల్కహాల్ తప్పనిసరి అనే ట్రెండ్ నడుస్తోంది. అయితే, మరీ ఎక్కువగా తాగకుండా, ఒక్కోసారి కొద్దికొద్దిగా తాగే అలవాటున్న చాలామంది ఒకేసారి పెద్ద బాటిల్ కొని పెట్టుకుంటారు. కానీ, ఇలా ఓపెన్ చేసిన బాటిల్(opened alcohol)ను ఎన్ని రోజులు ఉంచి తాగాలి? ఇదే విషయంపై చాలామందికి సరైన అవగాహన లేదు.
ఇది పర్ఫ్యూమ్ , మెడిసిన్ కాదు అయినా దీనికీ మూత ఓపెన్ చేశాక ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందంటున్నారు నిపుణులు.మూత తీయకముందే ఎక్స్‌పైరీ డేట్ ..మూత తీస్తే ఆ రూల్స్ ఏమీ ఉండవు. మూత వేస్తే ఏమవుతుందిలే, ఎన్ని రోజులైనా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు! ఒకసారి మద్యం బాటిల్ మూత తెరిచిన తర్వాత, అందులో ఉండే ఆల్కహాల్ గాలిలోని ఆక్సిజన్‌తో రియాక్ట్ అవుతుంది.
ఈ ప్రాసెస్ వల్ల దాని రుచి, వాసన, నాణ్యత పూర్తిగా మారిపోతాయి. అంతేకాదు, ఎసిటిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి, అల్కహాల్ చేదుగా, పుల్లగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఓపెన్ చేసిన బాటిల్‌ను వారం రోజుల లోపు, మహా అయితే 10 రోజుల లోపు తాగేయడం సురక్షితం.
యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న బీర్ విషయంలో ఈ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. బీర్ బాటిల్ మీద ఎక్స్‌పైరీ డేట్ ఆరు నెలల వరకు ఉన్నా, ఒకసారి ఓపెన్ చేస్తే గాలి తగలగానే అందులోని కార్బన్ డయాక్సైడ్ పోతుంది. దీంతో బీర్ రుచి పూర్తిగా మారి, చేదుగా, చప్పగా తయారవుతుంది. అందుకే ఓపెన్ చేసిన బీర్ బాటిల్‌ను ఒక రోజులోనే తాగేయాలి. ఆ తర్వాత తాగితే అది మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.
ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ఏంటంటే, ఓపెన్ చేసి ఎక్కువ రోజులు ఉంచిన ఆల్కహాల్(alcohol) వల్ల అనవసరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే, తక్కువ పరిమాణంలో, ఎప్పటికప్పుడు ఫ్రెష్ బాటిల్ ఓపెన్ చేసి తాగడం ఉత్తమం. అలా కాకుండా పాత బాటిళ్లను తాగడం వల్ల ఆరోగ్యం మరింత పాడవుతుంది. కాబట్టి, ఇకపై మీ ఇంట్లో ఏ పార్టీ జరిగినా, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నా.. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి.అలా అని ఆల్కహాల్ తాగండి అని ఎంకరేజ్ చేయడం కాదు. తాగే అలవాటున్నవారికి మాత్రమే ఇవి పాటించాలని చెప్పడం మాత్రమే.