Gold:బంగారం వెనుకున్న బంగారం లాంటి రహస్యాలు మీకు తెలుసా?

Gold: బంగారం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా మన దేశంలో మహిళలకు మరీ ఎక్కువ. అలాంటి బంగారం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.

Gold: బంగారం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా మన దేశంలో మహిళలకు మరీ ఎక్కువ. బంగారం(Gold) కొనడం అలంకారం కోసమే కాదు, చాలా మంది శుభసూచికంగా కూడా భావిస్తారు. రాజుల కాలం నుంచి నేటి వరకు బంగారానికి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. అలాంటి బంగారం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి.

Gold:

అంతరిక్షంలో..
బంగారం భూమి మీదనే కాదు, అంతరిక్షంలో కూడా ఉపయోగపడుతుంది. వ్యోమగాములు తలపై ధరించే హెల్మెట్‌పై బంగారు పూత పూస్తారట. ఇది సూర్యుని నుంచి వెలువడే ప్రమాదకరమైన ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను పరావర్తనం చెందేలా చేస్తుంది.

జీర్ణశక్తికి..
ఇప్పుడు చాలా మంది స్వీట్లపై వెండిని పల్చని పొరలా పూత పూసి తింటారు. పూర్వ కాలంలో బంగారాన్ని కూడా అలాగే వేసుకొని తినేవారట. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని వారి నమ్మకం.

ఆరోఫోబియా
ఇతర దేశాల్లో బంగారం పెట్టుబడిగా భావిస్తారు. కానీ మన దేశంలో శుభసూచకంగా పరిగణిస్తారు. కొంతమంది బంగారం చూడడానికి భయపడుతుంటారు. దీన్నే ఆరోఫోబియా(Aurophobia) అంటారు.

రక్తంలోనూ..
మనిషి శరీరంలో 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుందట. దీనిలో ఎక్కువ భాగం రక్తంలో ఉంటుంది. ఇక ప్రపంచ దేశాల్లోని బంగారంతో పోలిస్తే మన దేశంలోనే 11 శాతం ఎక్కువ బంగారం ఉందట.

సముద్రాల్లో బంగారం
సముద్రంలో కూడా సుమారు 20 మిలియన్ టన్నుల బంగారం ఉందట. ఇది ప్రపంచంలోని ప్రజలందరికీ పంచితే ప్రతి ఒక్కరికి నాలుగు కిలోల చొప్పున బంగారం వస్తుందనే ప్రచారం ఉంది.

Exit mobile version