Phone: కొద్దిసేపు ఫోన్‌కు దూరంగా ఉంటే.. మన మెదడు ఏం చేస్తుందో తెలుసా?

Phone: మన మెదడు నిరంతరంగా సమాచారంతో నిండిపోయి, కొత్త ఆలోచనలు, సృజనాత్మకతకు అవసరమైన ఖాళీ సమయాన్ని కోల్పోతుంది.

Phone

నేటి ఆధునిక జీవితంలో మనం నిరంతరం మన స్మార్ట్‌ఫోన్‌(Phone)లు, సోషల్ మీడియాకు అతుక్కుపోయాం. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడటం నుంచి, పడుకునే వరకు స్క్రీన్ వైపే చూస్తున్నాం. ఈ నిరంతర ఆకర్షణ, తక్షణ సంతృప్తిని కోరుకునే మన ధోరణిని నిపుణులు ఒక రకమైన డోపమైన్ అడిక్షన్ గా అభివర్ణిస్తున్నారు.

నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు, అప్‌డేట్‌లు మన మెదడును నిత్యం హైపర్-యాక్టివ్‌గా ఉంచుతున్నాయి. దీనివల్ల మన మెదడుపై, మానసిక ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా, ఏకాగ్రత లోపం (Focus Deficit) పెరుగుతుంది. ఏదైనా పనిని ఎక్కువసేపు చేయలేకపోవడం, నిరంతరం ఫోన్ చెక్ చేయాలనే ప్రేరణ కలగడం దీని లక్షణాలు. అంతేకాక, రాత్రి పడుకునే ముందు స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి (Insomnia) వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మన మెదడు నిరంతరంగా సమాచారంతో నిండిపోయి, కొత్త ఆలోచనలు, సృజనాత్మకతకు అవసరమైన ఖాళీ సమయాన్ని కోల్పోతుంది.

Phone

ఈ సమస్యల నుంచి బయటపడటానికి, ‘డిజిటల్ డిటాక్స్’ (Digital Detox) లేదా డిజిటల్ ఉపవాసం పాటించడం చాలా అవసరం. దీని అర్థం, కొంత సమయం పాటు అది కొన్ని గంటలు కావచ్చు, లేదా వారాంతం కావచ్చు . ఉద్దేశపూర్వకంగా అన్ని డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటం. ఈ డిటాక్స్ వల్ల మెదడుకు చాలా అవసరమైన విశ్రాంతి లభిస్తుంది. నిరంతర ప్రేరణ ఇచ్చే డోపమైన్ హార్మోన్ల అడిక్షన్ తగ్గి, మెదడులోని అలసట నివారింపబడుతుంది. దీని ఫలితంగా సహజంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ముఖ్యంగా, సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి కలిగే FOMO (Fear of Missing Out – ఏదో కోల్పోతున్నామనే భయం) తగ్గి, ఇతరులతో పోల్చుకునే ధోరణి తగ్గుతుంది, తద్వారా ఒత్తిడి నివారింపబడుతుంది. డిజిటల్ డిటాక్స్ వల్ల మన సృజనాత్మకత (Creativity), సమస్య పరిష్కార సామర్థ్యం పెరుగుతాయి. అంతేకాక, మన దృష్టి అంతా తెరపై కాకుండా, మన చుట్టూ ఉన్న వ్యక్తులపై, జీవితంలో ఉన్న ముఖ్యమైన సంబంధాలపై కేంద్రీకరించబడుతుంది. అందుకే, ఈ డిజిటల్ ఉపవాసం అనేది మన ఆధునిక జీవితంలో సమతుల్యతను, ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి అత్యవసరం.

Asia Cup: తెలుగోడి దెబ్బ…పాకిస్తాన్ అబ్బా టీమిండియాదే ఆసియాకప్

Exit mobile version