Sandals: చెప్పుల విషయంలో చేసే ఈ తప్పు వల్ల అనారోగ్యాలు తప్పవా?

Sandals : పాత చెప్పుల వాడకం ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణులు చెప్పే ఈ విషయం ఆశ్చర్యపరుస్తుంది!

Sandals

మనం రోజూ వాడే స్లిప్పర్స్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా ఈ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు, కానీ ఇది అక్షరాలా నిజం. మనం నిత్యం వాడే చెప్పులు, షూస్‌కు కూడా ఒక గడువు తేదీ ఉంటుంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్ల చాలామంది తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలిస్తే మాత్రం మీరు కచ్చితంగా అలర్ట్ అవుతారు.

ఆధునిక జీవనశైలిలో దుస్తులు, యాక్ససరీస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, చెప్పులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా సందర్భాన్ని బట్టి, సీజన్‌ను బట్టి రకరకాల డిజైన్ల చెప్పులు, షూస్‌ను కొని వాడుతుంటారు. అయితే చాలామందిలో అవి పాడయిపోకుండా ఉంటే, ఎంతకాలమైనా పర్లేదు అనుకుని వాడేస్తుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sandals

పాత చెప్పుల వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి?

ఆరు నెలలకు మించి పాతబడిన చెప్పులు(Sandals), షూస్‌ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి: చెప్పులు(Sandals), సాక్స్‌లు పాతబడే కొద్దీ, వాటిలో ఒక రకమైన ఫంగస్ ఏర్పడుతుంది. మనం నడిచినప్పుడు, చెమట పట్టడం వల్ల ఈ ఫంగస్, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మక్రిములు పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఈ క్రిములు వృద్ధి చెందుతూనే ఉంటాయి.

శరీరంలోకి క్రిములు ప్రవేశం: ఈ బ్యాక్టీరియా మన కాళ్ళ చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి, అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఉదాహరణకు, పాదాలపై దురద, పగుళ్లు, వాపు వంటి చర్మ సమస్యలు రావచ్చు.

అంటు వ్యాధులు: కొన్ని సందర్భాల్లో ఈ క్రిములు మన రక్తంలో కలిసి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు.

ఆర్థిక నష్టం: ఈ సమస్యలను తగ్గించుకోవడానికి వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఫలితంగా అనారోగ్యంతో పాటు ఆర్థిక నష్టం కూడా తప్పదు.

Sandals

సాధారణంగా, ఏ రకమైన చెప్పులు లేదా షూస్‌నైనా ఆరు నెలలకు మించి వాడకపోవడం మంచిది. ఒకవేళ వాటిని రోజువారీగా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే వాడినప్పటికీ, ఒక సంవత్సరం తర్వాత వాటిని మార్చడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

ఈ విషయం తెలియని చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి పాతబడిన చెప్పులను (Sandals )పక్కన పెట్టేసి, కొత్తవి కొనుక్కోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 

 

Exit mobile version