Khakhra:గుజరాత్ క్రిస్పీ కింగ్ – ఖాక్రా ..టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి బెస్ట్

Khakhra: ఖాక్రా చాలా తేలికగా ఉంటుంది. దీనిలో నూనె చాలా తక్కువగా ఉంటుంది, అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది.

Khakhra

గుజరాత్ అనగానే మనకు గుర్తొచ్చేవి అక్కడ దొరికే రకరకాల ఫర్సాన్ (Farsan) స్నాక్స్. అందులో పూణే బాకరవడి లాగా, గుజరాత్‌లో దొరికే అతి ముఖ్యమైన, ఎప్పుడూ అందుబాటులో ఉండే స్నాక్ ఖాక్రా(Khakhra). ఇది చూడడానికి రోటీ (చపాతీ) లాగా ఉంటుంది, కానీ చాలా సన్నగా, క్రిస్పీగా ఉంటుంది.

ఖాక్రా (Khakhra)అనేది గుజరాతీ, రాజస్థానీ వంటకం. దీన్ని గోధుమ పిండి, లేదా మైదా పిండి, లేక మల్టీగ్రెయిన్ పిండితో చేస్తారు. పిండిలో కొంచెం మసాలాలు, నూనె, ఉప్పు కలిపి చపాతీ పిండిలా కలుపుతారు. తర్వాత దాన్ని వీలైనంత సన్నగా రోల్ చేసి, పెనం మీద తక్కువ మంట మీద నెమ్మదిగా కాల్చి, పూర్తిగా క్రిస్పీగా అయ్యే వరకు ఒత్తుతూ ఉంటారు. అందుకే దీన్ని “క్రిస్పీ రోటీ” అని కూడా అంటారు.

ఖాక్రా (Khakhra)చాలా తేలికగా ఉంటుంది. దీనిలో నూనె చాలా తక్కువగా ఉంటుంది, అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా, ట్రావెల్ చేసేటప్పుడు లేదా లంచ్/డిన్నర్ మధ్య ఆకలేసినప్పుడు దీన్ని తినడానికి ఇష్టపడతారు. దీనిని ప్యాకెట్లలో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

Khakhra

దీన్ని సాధారణంగా కారం, ఉప్పు, కొత్తిమీర కలిపిన గ్రీన్ చట్నీ (Pudina Chutney) తో లేదా స్వీట్ మ్యాంగో పికిల్ (మామిడి ఊరగాయ) తో తింటారు. కొందరు దీనిపై కొంచెం నెయ్యి లేదా వెన్న రాసి, ఉప్పు, మిరియాలపొడి చల్లుకుని తింటారు. మరీ ముఖ్యంగా దీన్ని ఆలుగడ్డల కర్రీ లేదా పప్పు కూరతో కూడా సైడ్ డిష్‌గా తీసుకుంటారు.

ఖాక్రాలో చాలా రకాలు ఉంటాయి:

Bhakarwadi: పుణే స్పెషల్.. బాకరవడి ఎప్పుడయినా టేస్ట్ చేశారా?

Exit mobile version