Health Benefits
నీళ్లు తాగడం అనేది ఆరోగ్యానికి మంచిదని ( Health Benefits ) అందరికీ తెలుసు.. కానీ సమయాన్ని బట్టి దాని ఫలితాలు మారుతుంటాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మన శరీరానికి ఒక సహజ సిద్ధమైన డీటాక్స్ (Detox) లా పనిచేస్తుంది.
మొదటిగా, గోరువెచ్చని నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజంతా తిన్న ఆహారం నిద్రలో సులభంగా అరగడానికి ఇది తోడ్పడుతుంది. దీనివల్ల మరుసటి రోజు ఉదయం మలబద్ధకం సమస్య ఉండదు.
రెండోది, ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. వేడి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి, చెమట ద్వారా లేదా మూత్రం ద్వారా వ్యర్థాలు బయటకు వెళ్తాయి.
మూడోది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గోరువెచ్చని నీరు రక్తనాళాలను విస్తరింపజేసి, శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందేలా చేస్తుంది.
నాలుగో ప్రయోజనం బరువు తగ్గుతారు. నిద్రలో మెటబాలిజం రేటును పెంచడం ద్వారా కేలరీలను కరిగించడానికి ఇది సహాయపడుతుంది.
ఐదోది మానసిక ప్రశాంతత. వేడి నీరు తాగడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది.
జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మరింత మేలు చేస్తుంది. అయితే, నీరు మరీ వేడిగా ఉండకూడదు. నిద్రకు సరిగ్గా అరగంట ముందు తాగడం మంచిది.
ICC U19 World Cup 2026 : కుర్రాళ్ళు అదరగొట్టేస్తారా ?..అండర్ 19 వరల్డ్‌కప్ కు అంతా రెడీ
