Visa : వీసా తలనొప్పి లేకుండా విదేశీ యానం చేసేయండి..

Visa: నేపాల్‌లో ఉండే హిమాలయాల అందాలు, పశుపతినాథ్ ఆలయం వంటివి.. విదేశీ అనుభూతిని ఇస్తూనే భారత దేశంలోనే ఉన్నామా అన్న ఫీలింగ్‌ను కలిగిస్తాయి.

Visa

ఫారెన్ ప్రయాణం అనగానే మనకు ముందుగా .. వేలల్లో ఖర్చయ్యే వీసా ఫీజులు అలాగే నెలల తరబడి వేచి చూడాల్సిన వీసా(visa) ఇంటర్వ్యూలు గుర్తుకు వస్తాయి. కానీ భారతీయుల కోసం కొన్ని పొరుగు దేశాలు చాలా ఈజీగా ఉండే కండిషన్లతో వెల్కమ్ చెప్పడానికి రెడీగానే ఉన్నాయి.

ఉదాహరణకు నేపాల్ దేశానికి వెళ్లడానికి భారతీయులకు పాస్‌పోర్ట్ కూడా అవసరం లేదు. భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలు అక్కడ ఎంచక్కా ట్రావెల్ చేసి రావొచ్చు. నేపాల్‌లో ఉండే హిమాలయాల అందాలు, పశుపతినాథ్ ఆలయం వంటివి.. విదేశీ అనుభూతిని ఇస్తూనే భారత దేశంలోనే ఉన్నామా అన్న ఫీలింగ్‌ను కలిగిస్తాయి.

Nepal

అలాగే భూటాన్ దేశం కూడా ఇండియన్స్‌కు వీసా ఫీజు లేకుండానే తమ దేశంలోకి అనుమతి కల్పిస్తోంది. అత్యంత స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన జీవనశైలిని ఇష్టపడే వారికి భూటాన్ ఒక స్వర్గం వంటిది. అడవులు, పర్వతాల మధ్య సాగే ఈ ప్రయాణం ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుందనడంలో డౌట్ అక్కరలేదు.

Bhutan

ఇక సముద్ర తీరాలను ఇష్టపడే వారికి శ్రీలంక , థాయిలాండ్ చాలా బెస్ట్ ఆప్షన్లు. శ్రీలంక ప్రభుత్వం కూడా భారతీయులకు ఉచిత వీసా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇక్కడి రామాయణ సర్క్యూట్‌తో పాటు అందమైన బీచ్‌లు పర్యాటకులను కట్టిపడేస్తాయి.

Sri Lanka

థాయిలాండ్ కూడా టూరిజం రంగాన్ని ప్రోత్సహించడానికి తరచుగా వీసా ఫీజు మినహాయింపులను ఇస్తూ ఉంటుంది. మనం దేశంలో ఉన్న గోవా, అండమాన్‌కు వెళ్లడానికి అయ్యే ఖర్చుతోనే ఈ దేశాలను ఎంచక్కా చుట్టి రావచ్చు.

Thailand

అయాతే ఇక్కడ ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. స్వదేశం అయినా విదేశాలకు అయినా టూర్ ప్లాన్ చేసినపుడు హోటల్ బుకింగ్స్ , ఫ్లైట్ టికెట్లు 2,3 నెలల ముందుగానే ప్లాన్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ టూర్‌ను ముగించవచ్చు.

కేవలం పాస్‌పోర్ట్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్ని చూడాలనుకునేవారి కోరికను తీర్చుకోవడానికి ఈ పొరుగు దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఫారెన్ కల్చర్‌ను, విదేశీ రుచులను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ది బెస్ట్ ప్లేసులు ఇవే.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version