Sigma personality
మాములుగా మనుషుల ప్రవర్తనను బట్టి వారిని ‘ఆల్ఫా’, ‘బీటా’ అని విభజిస్తుంటారు. ఆల్ఫా అంటే అందరినీ లీడ్ చేసేవారని, బీటా అంటే మాట వినేవారని చెబుతారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఉండే మరొక పర్సనాలిటీగా ‘సిగ్మా పర్సనాలిటీ’ (Sigma Personality) ఉంది. వీరిని ‘లోన్ ఉల్ఫ్’ (Lone Wolf) అని కూడా పిలుస్తారు. అంటే వీరు ఒంటరిగా ఉంటూనే ప్రపంచాన్ని గెలవగలరు. ఒకవేళ సిగ్మాలలాగే మీకు కూడా ఒంటరిగా ఉండటం ఇష్టమైతే, ఈ కింద చెప్పిన లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి.
ఒంటరితనాన్ని ప్రేమిస్తారు.. సిగ్మా(Sigma personality) వ్యక్తులకు మనుషుల మధ్యలో ఉండటం అంటే అస్సలు నచ్చదు. వీరు వీకెండ్స్ లో పార్టీలకు వెళ్లడం కంటే ఇంట్లోనే ఒక పుస్తకం చదువుకుంటూ లేదా ఒక సినిమా చూస్తూ ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. అలా అని వీరు పిరికివారు కాదు, కేవలం తమ సొంత కంపెనీని మాత్రమే ఎంజాయ్ చేస్తారు.
రూల్స్ బ్రేక్ చేస్తారు.. సమాజం పెట్టిన కట్టుబాట్లు అన్నా, పనికిరాని రూల్స్ అన్నా వీరికి అస్సలు గిట్టదు. తమకు నచ్చినట్లుగా బతకడానికి ఇష్టపడతారు. ఎవరి కిందా పనిచేయడం వీరికి నచ్చదు.. అందుకే వీరు ఎక్కువగా సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు.
తక్కువ మాట్లాడతారు.. ఎక్కువ గమనిస్తారు.. వీరు అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటారు. ఎవరైనా మాట్లాడుతుంటే వారిని నిశితంగా గమనిస్తారు కానీ వెంటనే రియాక్ట్ అవ్వరు. ఒకవేళ వీరు మాట్లాడితే అందులో చాలా లోతైన అర్థం ఉంటుంది.
ఎవరి నుంచి గుర్తింపు కోరుకోరు.. ఆల్ఫా పర్సనాలిటీ లాగా అందరూ తనను పొగడాలని, తన మాటే అందరూ వినాలని వీరు కోరుకోరు. తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. ఎదుటివారు ఏమనుకున్నా వీరికి సంబంధం ఉండదు.
అడాప్టబిలిటీ (అలవాటు పడటం)..ఏ ప్రదేశానికి వెళ్లినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వీరు త్వరగానే అలవాటు పడతారు. ఎవరి మీద ఎక్కువ ఆధారపడకుండానో, అసలు ఆధారపడకుండానో తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటారు.
మీలో కూడా ఈ లక్షణాలు ఉంటే, మీరు కచ్చితంగా ఒక సిగ్మా పర్సనాలిటీయే(Sigma personality). నిజంగా ఇది ఒక అరుదైన , శక్తివంతమైన వ్యక్తిత్వం అంటారు మానసిక విశ్లేషకులు.
