Boyapati:బాలీవుడ్‌లో బోయపాటి జెండా .. హీరో కూడా ఫిక్స్

Boyapati: గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'జాట్' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

Boyapati

టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ మూవీ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు డైరెక్టర్ బోయపాటి(Boyapati) శ్రీను. బాలయ్య లాంటి అగ్రెస్సివ్ హీరోనే కాదు రామ్ పోతినేని, శ్రీనివాస్ బెల్లంకొండ వంటి సాప్ట్ హీరోలని కూడా బోయపాటి తెరపై చూపించే స్టైల్‌కు థియేటర్లో విజిల్స్ పడాల్సిందే. అలా బాలకృష్ణతో ఆయన తీసిన సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిన విషయమే.

అయితే ఇప్పుడు అఖండ-2 తర్వాత బోయపాటి(Boyapati) శ్రీను ఏం చేయబోతున్నారు? తన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందని.. చాలా రోజుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలకు ఒక క్రేజీ ఆన్సర్ వినిపిస్తోంది. ఈసారి బోయపాటి శ్రీను టాలీవుడ్‌ని దాటి బాలీవుడ్‌లో.. తన మార్క్ యాక్షన్‌ను మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నారు.

చాలా కాలంగా బోయపాటి నెక్స్ట్ మూవీ గురించి రకరకాల ఊహాగానాలు జరిగాయి. అల్లు అర్జున్‌తో సరైనోడు-2 ఉంటుందని , ఒక తమిళ్ హీరోతో మూవీ ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం బాలీవుడ్ వైపు మళ్లింది. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ యాక్ట్ చేసిన జాట్ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసే బాధ్యతను.. బోయపాటి శ్రీను తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు పార్ట్-2 తీయబోతున్నారట.

Boyapati

సన్నీ డియోల్ అంటేనే పవర్ ఫుల్ యాక్షన్‌కు కేరాఫ్. ఇటు బోయపాటి అంటే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే డైరెక్టర్ అన్న స్టాంప్ వేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమేనని సినిమా క్రిటిక్స్ భావిస్తున్నారు. సన్నీ డియోల్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ స్టోరీని బోయపాటి రెడీ చేస్తున్నారట.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులు స్పీడుగా జరుగుతున్నాయట. అయితే దీనిపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. హిందీ వెండితెరపై బోయపాటి తన యాక్షన్ మ్యాజిక్‌తో ఎలాంటి సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version