Chia seeds: చియా సీడ్స్.. ఎలా వాడాలో, ఎలా తినాలో తెలుసా?

Chia seeds: ఒకప్పుడు మెక్సికోలో మాత్రమే లభించే చియా గింజలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఆహారంగా గుర్తింపు పొందాయి.

Chia seeds

చియా సీడ్స్(Chia seeds) చూడటానికి చిన్నగా ఉన్నా, అవి పోషకాల గని అని చెప్పొచ్చు. ఈ చిన్న గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒకప్పుడు మెక్సికోలో మాత్రమే లభించే చియా గింజలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఆహారంగా గుర్తింపు పొందాయి. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని కూడా ‘సూపర్ ఫుడ్’ అని పిలుస్తారు.

ఇవి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. చియా గింజ(Chia seeds)ల్లో ఉండే ఫైబర్ నీటిని పీల్చుకొని జెల్ లాగా మారుతుంది. ఇది కడుపులో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల అనవసరంగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.అలాగే అధిక ఫైబర్ ఉండటం వల్ల చియా గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి.

Chia seeds

చియా గింజ(Chia seeds)ల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.అంతేకాదు చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేసి, ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

చక్కెర నియంత్రణ.. చియా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి చాలా మంచివి.
చియా గింజలను ఎలా ఉపయోగించాలంటే..చియా గింజలను నేరుగా తినడం కంటే, వాటిని నీటిలో నానబెట్టి తినడం మంచిది.
చియా జెల్.. ఒక కప్పు నీటిలో రెండు టేబుల్‌స్పూన్ల చియా గింజలు వేసి, ఒక అరగంట సేపు నానబెట్టాలి. అది జెల్ లాగా మారిన తర్వాత, దాన్ని అలాగే తాగొచ్చు లేదా ఇతర ఆహార పదార్థాలలో కలుపుకోవచ్చు.

స్మూతీస్.. స్మూతీస్ తయారు చేసేటప్పుడు ఒక టేబుల్‌స్పూన్ చియా గింజలు వేస్తే, అది పోషక విలువలను పెంచుతుంది.
పెరుగు, ఓట్మీల్.. చియా జెల్‌ను పెరుగు, ఓట్మీల్ లేదా సలాడ్‌లలో కలుపుకొని తినొచ్చు.
పుడ్డింగ్.. పాలు, తేనె, పండ్లతో చియా గింజలను కలిపి పుడ్డింగ్ తయారు చేసుకోవచ్చు.
చియా గింజలు ఒక ఆరోగ్యకరమైన ఆహారం, వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.

Bumrah:ఫైనల్ కు అడుగే దూరం..బంగ్లాపై బుమ్రాకు రెస్ట్ ?

Exit mobile version