Sore throat: తరచుగా గొంతు నొప్పి వస్తుందా? ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టండి

Sore throat: మారుతున్న వాతావరణం, ముఖ్యంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం వల్ల ఈ గొంతునొప్పి ఒక సాధారణ సమస్యగా మారింది.

ఒక ఉదయం లేవగానే గొంతులో ఏదో పట్టేసినట్లు అనిపించడం, మింగడానికి ఇబ్బంది పడటం, ఇక అప్పటి నుంచి రోజులో ఏ పనీ చేయబుద్ధి కాకపోవడం చాలామందికి అనుభవమే. మారుతున్న వాతావరణం, ముఖ్యంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం వల్ల ఈ గొంతునొప్పి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది కేవలం ఒక చిన్న అసౌకర్యం మాత్రమే కాదు, కొన్నిసార్లు అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా కావచ్చు.

గొంతు నొప్పి(sore throat)కి ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా వంటివి కారణమవుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల గొంతులో మంట, ఇబ్బంది నెలకొంటుంది. మరోవైపు, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు గొంతునొప్పిని మరింత తీవ్రతరం చేసి, జ్వరం, విషపూరిత పరిస్థితికి దారితీయవచ్చు. వీటితో పాటు, అలర్జీలు, వాతావరణంలో మార్పులు ,వాయు కాలుష్యం కూడా గొంతునొప్పి(Sore throat)కి కారణమవుతాయి.

Sore throat

ఈ సమస్యలను నివారించేందుకు , ఉపశమనం పొందేందుకు ఇంట్లో పాటించదగిన సులభమైన పద్ధతులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం. ఇది గొంతులోని క్రిములను నాశనం చేయడంలో, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, తరచుగా తేనె తీసుకోవడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. ఆవిరి పట్టడం (steam inhalation) కూడా గొంతులో తేమను పెంచి, పొడిదనాన్ని, ఇబ్బందిని తగ్గిస్తుంది.

ఇవి సాధారణ లక్షణాలను తగ్గించుకోవడానికి మాత్రమే. ఒకవేళ గొంతు నొప్పి తీవ్రంగా మారి, జ్వరంతో పాటు వస్తే, మింగడానికి చాలా ఇబ్బందిగా ఉంటే లేదా శ్వాస తీసుకోవడంలో కష్టం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. ఈ స్వల్ప లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి, సమస్యను తొందరగా గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఆరోగ్య రక్షణకు చాలా ముఖ్యం.

గొంతునొప్పి(Sore throat) ఒక సాధారణ సమస్య అయినా, దాని పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. రోజువారీ జీవితంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి సులభంగా ఉపశమనం పొందొచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఎప్పుడూ మంచిదే.

Ranya Rao:కన్నడ నటి రన్యా రావుకు షాక్: రూ. 102 కోట్ల భారీ జరిమానా

Exit mobile version