Ice water: ఐస్ వాటర్ తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

Ice water: మనం చల్లటి నీరు తాగినప్పుడు, మన శరీరం ఆ నీటిని తన సహజ శరీర ఉష్ణోగ్రతకు (37°C) తీసుకురావడానికి ఎక్కువ శక్తిని, అంటే ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది.

Ice water

బరువు తగ్గడానికి ప్రయత్నించే చాలామంది చేసే ప్రయత్నాలలో ఒకటి… చల్లటి నీరు (ఐస్ వాటర్) తాగడం. ఈ సిద్ధాంతం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మనం చల్లటి నీరు తాగినప్పుడు, మన శరీరం ఆ నీటిని తన సహజ శరీర ఉష్ణోగ్రతకు (37°C) తీసుకురావడానికి ఎక్కువ శక్తిని, అంటే ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది. ఈ అదనపు శక్తి ఖర్చు బరువు తగ్గడానికి సహాయపడుతుందని నమ్ముతారు.

సిద్ధాంతం ఎంతవరకు నిజం అన్న ప్రశ్న తలెత్తితే..ఈ సిద్ధాంతం పాక్షికంగా నిజమే. ఈ ప్రక్రియను ‘థర్మోజెనిసిస్‘ అని అంటారు. శరీరంలోకి చల్లటి ద్రవం ప్రవేశించినప్పుడు, దానిని వేడి చేయడానికి శరీరం శక్తిని ఉపయోగించడం సహజం. అయితే, ఈ ప్రక్రియలో ఖర్చయ్యే కేలరీల సంఖ్య చాలా తక్కువ.

ice water

పరిశోధనల ప్రకారం, ఒక రోజులో లీటరు ఐస్ వాటర్ తాగితే, శరీరం దాన్ని వేడి చేయడానికి సుమారు 8 నుంచి 10 కేలరీలను మాత్రమే ఖర్చు చేయగలదు. అంటే, మీరు ఒక నెల మొత్తం ప్రతిరోజూ లీటరు చల్లటి నీరు తాగినా, మీరు కోల్పోయే మొత్తం బరువు కొన్ని గ్రాములు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒక బిస్కెట్ లేదా ఒక చిన్న చాక్లెట్ తింటే వచ్చే కేలరీలు, ఈ ప్రక్రియలో కోల్పోయే కేలరీల కంటే చాలా ఎక్కువ.

అయినా కూడా చల్లటి నీరు బరువు తగ్గడానికి పరోక్షంగా సహాయపడుతుంది.

ఆకలి నియంత్రణ (Satiety).. భోజనానికి ముందు చల్లటి నీరు(ice water) తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి, దీని ద్వారా మీరు తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది అధిక కేలరీలు తీసుకోకుండా నివారిస్తుంది.

ice water

వ్యాయామ సామర్థ్యం.. వ్యాయామం చేస్తున్నప్పుడు చల్లటి నీరు(ice water) తాగితే, మీ శరీరం ఉష్ణోగ్రత వేగంగా పెరగకుండా నివారించి, ఎక్కువ సేపు, సమర్థవంతంగా వ్యాయామం చేయడానికి సహాయపడుతుంది. దీని ద్వారా మీరు ఎక్కువ కేలరీలను ఖర్చు చేయగలుగుతారు.

కేవలం ఐస్ వాటర్(ice water) తాగడం ద్వారా అద్భుతంగా బరువు తగ్గడం అనేది అవాస్తవం. ఇది ఒక మెటబాలిజం బూస్టర్ గా పనిచేసినా, ఆ ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది. బరువు తగ్గడానికి సరైన మార్గం ఏమిటంటే… సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. అయితే, రోజూ సరిపడా నీరు (అది చల్లటి నీరు అయినా, సాధారణ నీరు అయినా) తాగడం మాత్రం మీ మొత్తం ఆరోగ్యానికి, మెటబాలిజాన్ని మెరుగుపరచడానికి తప్పకుండా అవసరం.

vijay: హీరో విజయ్ సభలో తొక్కిసలాట 33 మందికి పైగా మృతి

Exit mobile version