Emotional baggage: ఎమోషనల్ బ్యాగేజ్.. గతాన్ని మోసుకెళ్తూ జీవిస్తున్నారా?

Emotional baggage: మానసిక ఆరోగ్య నిపుణుల చెబుతున్న దాని ప్రకారం,ఎమోషనల్ బ్యాగేజ్ ఒకరి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఒక సైకలాజికల్ సమస్య.

Emotional baggage

జీవితం అంటే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎన్నో మధురమైన, బాధాకరమైన జ్ఞాపకాలను పోగు చేసుకుంటాం. కానీ, ఆ చేదు అనుభవాలను, బాధలను ఒక బరువులా మనసులో మోసుకెళ్లడాన్నే ‘ఎమోషనల్ బ్యాగేజ్’ (Emotional baggage)అంటారు. ఈ బరువు మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. మానసిక ఆరోగ్య నిపుణుల చెబుతున్న దాని ప్రకారం, ఇది ఒకరి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఒక సైకలాజికల్ సమస్య.

సైంటిఫిక్ రీజన్ చూస్తే.. మన మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం ‘అమిగ్డాలా’ (Amygdala). ఈ అమిగ్డాలాకు భయం, ఒత్తిడి, అవమానం, బాధ వంటి నెగెటివ్ అనుభవాలను ఎక్కువ కాలం స్టోర్ చేసుకునే లక్షణం ఉంది. అందుకే గతంలో జరిగిన ఒక చేదు అనుభవం, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక చిన్న ట్రిగ్గర్ వల్ల మళ్లీ గుర్తుకొస్తుంది. దీనివల్ల మన శరీరంలో ‘కార్టిసోల్’ (Cortisol) అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరిగి, మనం ఆ గతం గురించే ఎక్కువగా బాధపడతాం. ఇది మన ప్రస్తుత జీవితాన్ని, నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.

ఎమోషనల్ బ్యాగేజ్(Emotional baggage)అనేది ఒక భావోద్వేగ సమస్య. దాని ప్రభావం మన రోజువారీ జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది.సంబంధాలు తెగిపోయిన తర్వాత, ఒక బ్రేకప్ లేదా విడాకుల తర్వాత, చాలా మంది వ్యక్తులు కొత్త బంధాలను నమ్మలేకపోతారు. వీళ్లు కూడా నన్ను మళ్లీ వదిలేస్తారేమో” అనే భయంతో, అనుమానంతో ఒంటరిగా ఉండిపోతారు.

చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి లేదా ఇతరుల నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న వారు, పెద్దయ్యాక కూడా “నేను దేనికీ పనికిరాను” లేదా “నేను ఏం చేసినా తప్పే” అనే భావనతో బాధపడతారు. దీనివల్ల వారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ (Inferiority Complex) పెరుగుతుంది.అలాగే ఒక ఉద్యోగం పోయిన తర్వాత, ఇంకో కొత్త ఉద్యోగంలో చేరినప్పటికీ, “ఎప్పుడో మళ్లీ నన్ను తొలగిస్తారేమో” అనే భయం వారిని వెంటాడుతుంది. ఇది వారి పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.

ఎమోషనల్ బ్యాగేజ్(Emotional baggage) మనల్ని మానసికంగా, శారీరకంగా బలహీనపరుస్తుంది. దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్రలేమి, అధిక రక్తపోటు, మరియు అలసట వంటి సమస్యలు రావచ్చు. కానీ దీనిని అధిగమించడం సాధ్యమే. సైకాలజిస్టులు కొన్ని పద్ధతులను సూచిస్తారు.

కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ (Cognitive Reframing).. గతాన్ని మార్చలేం, కానీ దాని గురించి మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవచ్చు. “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని బాధపడటం మానేసి, “ఈ అనుభవం నుంచి నేను ఏం నేర్చుకున్నాను?” అని ఆలోచించడం మొదలుపెట్టాలి.జర్నలింగ్ (Journaling).. మనసులోని భావాలను, బాధలను ఒక డైరీలో రాసుకోవడం వల్ల అమిగ్డాలాలో పేరుకుపోయిన నెగెటివ్ మెమరీస్ తగ్గుతాయి.

Emotional baggage

మైండ్‌ఫుల్‌నెస్ & మెడిటేషన్ పద్ధతులు మనసును వర్తమానంలో ఉంచుతాయి. దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది, సెరొటోనిన్ (Serotonin) వంటి హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయి.అవసరమైతే, ఒక సైకాలజిస్ట్‌ని సంప్రదించి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) వంటి చికిత్స తీసుకోవచ్చు. ఇది మనం మోసుకెళ్తున్న బరువును ఎలా వదిలించుకోవాలో నేర్పిస్తుంది.

చివరగా, గతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. కానీ దాన్ని ఒక భారంలా మోసుకెళ్తే, కొత్త సంతోషాలు మన జీవితంలోకి రావు. గతాన్ని అనుభవంగా స్వీకరించి, ఆ బరువును వదిలేసినప్పుడే మనసు తేలిక అవుతుంది, మరియు కొత్త జీవితం మొదలవుతుంది.

Murder: వర్షిణి హత్యకేసులో.. తల్లే విలన్

Exit mobile version