Black grapes
చాలా మంది అన్ని ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడినా ద్రాక్ష పండ్లు మాత్రం అస్సలు తినరు. పుల్లగా ఉంటాయని దూరం పెడతారు. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ద్రాక్ష పండ్ల పాత్ర ఎంతో కీలకమని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా నల్ల ద్రాక్ష పండ్లు మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయట.
నల్ల ద్రాక్ష(Black grapes)లో పోషకాలు..నల్ల ద్రాక్షలో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ సి, మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు గ్లూకోజ్, మెగ్నీషియం, మరియు సిట్రిక్ యాసిడ్స్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
క్యాన్సర్ నివారణ..నల్ల ద్రాక్షలో ఉండే పోషకాలు, విటమిన్లు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు..నల్ల ద్రాక్ష(Black grapes)లో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటమే కాకుండా, రక్తంలోని నైట్రిన్ ఆక్సైడ్ స్థాయిలు పెరిగి రక్తప్రసరణ మెరుగుపడుతుంది, దీని ద్వారా గుండె కండరాలకు మేలు జరుగుతుంది.
బరువు తగ్గడంలో సహాయం..బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ద్రాక్ష చాలా మంచి ఆప్షన్. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోయి, బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
మధుమేహ రోగులకు సురక్షితం..మధుమేహ రోగులు నల్ల ద్రాక్ష(black grapes)ను తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే రెస్వెరాటల్ అనే పదార్థం రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది, తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అందుకే, మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినవచ్చు.
సౌందర్య పోషణ..నల్ల ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరవు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. ఫలితంగా, మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు.
మొత్తంగా, నల్ల ద్రాక్ష పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.