Foot Pain: ఉదయం అడుగు వేయాలంటే భయమేస్తోందా? అరికాళ్ల నొప్పులను అశ్రద్ధ చేస్తే ప్రమాదమే..

Foot Pain: ఈ రోజుల్లోచాలామందికి అరికాళ్లలో విపరీతమైన నొప్పి, కొందరికి సూదులతో గుచ్చినట్లు అనిపించడం,మరి కొందరికి మంటలు రావడం వంటివి సాధారణమైన సమస్యలుగా మారిపోయాయి.

Foot Pain

చాలామంది ఉదయం నిద్రలేవగానే అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణం పోయినంత పనవుతుంది. ఈ రోజుల్లోచాలామందికి అరికాళ్లలో విపరీతమైన నొప్పి, కొందరికి సూదులతో గుచ్చినట్లు అనిపించడం,మరి కొందరికి మంటలు రావడం వంటివి సాధారణమైన సమస్యలుగా మారిపోయాయి. అసలు ఈ అరికాళ్ల నొప్పులు(Foot Pain)ఎందుకు వస్తాయి? దీన్ని తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఏం చేయాలి? అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

నొప్పికి ప్రధాన కారణాలు అరికాళ్ల నొప్పి(Foot Pain)కి ప్రధాన కారణం ‘ప్లాంటర్ ఫాసిటిస్’. మన మడమ నుంచి వేళ్ల వరకు ఉండే కండరాల పొర వాపునకు గురైనప్పుడు ఈ నొప్పి వస్తుంది.

అధిక బరువు.. శరీరం బరువు అంతా పాదాల మీద పడటం వల్ల కండరాలు త్వరగా అరిగిపోతాయి.

సరైన పాదరక్షలు లేకపోవడం.. ఫ్లాట్‌గా ఉండే చెప్పులు వాడటం లేదా చాలా గట్టిగా ఉండే షూస్ వేసుకోవడం వల్ల పాదాల మీద ఒత్తిడి పెరుగుతుంది.

యూరిక్ యాసిడ్ పెరగడం.. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది కీళ్ల దగ్గర పేరుకుపోయి విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది.

విటమిన్ లోపం.. ముఖ్యంగా విటమిన్ డి ,విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో నరాలు బలహీనపడి పాదాల మంటలు, నొప్పులు వస్తాయి.

Foot Pain

మనం చేయాల్సిన చిన్న చిన్న మార్పులు నిరంతరం నిలబడి పని చేసేవారు, ఎక్కువ దూరం నడిచేవారు పాదాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పాదాలను అందులో పది నిమిషాలు ఉంచితే కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది మంటలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే, పాదాల కింద ఒక టెన్నిస్ బాల్ లేదా వాటర్ బాటిల్ ఉంచి అటూ ఇటూ రోల్ చేయడం వల్ల పాదాల కండరాలు సాగి నొప్పి తగ్గుతుంది.

డైట్ లో ఏం మార్చుకోవాలంటే.. అరికాళ్ల నొప్పులు ఉన్నవారు నీరు ఎక్కువగా తాగాలి. కాల్షియం , మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే, అది మధుమేహం లేదా థైరాయిడ్ సమస్యకు సంకేతం కావొచ్చు. అందుకే నొప్పి తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. షూ కొనేటప్పుడు కుషన్ ఉండేలా చూసుకోవడం, వ్యాయామం చేసే ముందు పాదాల స్ట్రెచింగ్ చేయడం మర్చిపోవద్దు.

పాదం మన శరీరానికి పునాది వంటిది. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మనం ఉత్సాహంగా పనులు చేసుకోగలం. మీ పాదాల నొప్పిని కేవలం అలసట అనుకుని వదిలేయకండి, అది మీ శరీరంలో ఏదో ఒక లోపాన్ని సూచిస్తూ ఉండొచ్చు.అందుకే ముందే జాగ్రత్త పడండి

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version