Intermittent fasting
కొన్నేళ్లుగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (intermittent fasting) లేదా విరామ ఉపవాసం అనేది బరువు తగ్గడానికి , జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అత్యంత ప్రజాదరణ పొందిన డైట్‌గా మారింది. ఈ పద్ధతిలో ఆహారాన్ని తినే సమయాన్ని ఒక నిర్దిష్ట విండోకు (ఉదా. 8 గంటలు) పరిమితం చేసి, మిగిలిన సమయాన్ని (ఉదా. 16 గంటలు) ఉపవాసం ఉండాల్సి ఉంటుంది (16:8 పద్ధతి).
IF (Intermittent fasting)యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఉపవాస సమయంలో శరీరం నిల్వ ఉన్న కొవ్వును శక్తి కోసం ఉపయోగించడం ప్రారంభిస్తుంది (దీనిని కీటోసిస్ అంటారు). ఇది బరువు తగ్గడానికి , శరీర కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఉపవాసం కాలంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి, ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఈ ప్రక్రియ వల్ల సెల్యులార్ మరమ్మత్తు (Cellular Repair) మెరుగుపడుతుంది.
అయితు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్అనేది అందరికీ సరిపోకపోవచ్చని నిపుణులు అంటున్నారు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు (రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా హెచ్చుతగ్గులు ఏర్పడతాయి), ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు IF పద్ధతిని నివారించాలి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రారంభించిన తొలినాళ్లలో అలసట, తలనొప్పి, చిరాకు మరియు ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక ఆహార నియమం కాదు, కేవలం ఎప్పుడు తినాలి అనే సమయ నియమం మాత్రమే. బరువు తగ్గడానికి, ఉపవాసం విండోలో ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ని ప్రారంభించే ముందు వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి వైద్యులు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించడం తప్పనిసరిగా చేయాలి.
