Leg Movement: అదే పనిగా కాళ్లు కదపడం ఆరోగ్య సమస్యేనా?

Leg Movement: పదే పదే కాళ్లు షేక్ చేయడం, ముఖ్యంగా రాత్రి నిద్రలో కూడా ఈ అలవాటు ఉండటం వెనుక ఒక వైద్య కారణం ఉందని చెబుతున్నారు.

Leg Movement

కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. కూర్చున్నా, పడుకున్నా, ఏ పనిచేస్తున్నా అదే పనిగా కాళ్లు కదుపుతూనే(Leg Movement) ఉంటారు. ఇది కేవలం ఒక అలవాటు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నిపుణులు దీనిని ఒక ఆరోగ్య సమస్యగా చూస్తున్నారు. పదే పదే కాళ్లు షేక్ చేయడం, ముఖ్యంగా రాత్రి నిద్రలో కూడా ఈ అలవాటు ఉండటం వెనుక ఒక వైద్య కారణం ఉందని చెబుతున్నారు. దీనిని ‘రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్’ అని పిలుస్తారని అంటున్నారు.

రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అనేది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్. ఈ సమస్య ఉన్నవారికి నిద్రపోతున్నప్పుడు కాళ్లలో అకస్మాత్తుగా ఒక విధమైన అసౌకర్యం, నొప్పి లేదా లాగినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి తగ్గాలంటే కాళ్లను కదిలించడం తప్ప మరో మార్గం ఉండదు. అందుకే తెలియకుండానే వారు కాళ్లను కదిలిస్తూ ఉంటారు. ఈ సమస్య తీవ్రంగా ఉంటే, నిద్రలో కూడా కదలికలు మొదలవుతాయి. ఈ సిండ్రోమ్ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి శరీరంలో ఐరన్ లోపం. వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

Leg Movement

రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ జన్యుపరంగా కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, అది పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే, నిద్రలేమి, నరాల సమస్యలు, డయాబెటిస్ వంటి ఇతర అనారోగ్యాలు ఉన్నవారిలో కూడా ఈ సిండ్రోమ్ కనిపించవచ్చు. కొన్నిసార్లు ఎక్కువ టెన్షన్‌గా ఫీలవుతున్నా కాళ్లు షేక్ చేస్తుంటారు.

మీకు కాళ్లు కదిపే(Leg Movement) అలవాటు ఉన్నట్లయితే, నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. వారు సరైన కారణాన్ని గుర్తించి, చికిత్స అందిస్తారు. ఈ సిండ్రోమ్‌ను నయం చేయడానికి కొన్నిసార్లు ఫిజియోథెరపీ చికిత్స కూడా అవసరం అవుతుంది. అలాగే, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, రాత్రిపూట కాళ్లకు మసాజ్ చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి, ఒత్తిడి తగ్గించుకునే పనులు కూడా ఈ సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. అదే పనిగా కాళ్లు కదిలించడం కేవలం ఒక అలవాటు కాదు, అది మీ ఆరోగ్యం గురించిన ఒక సంకేతం.

Landslides: కళ్ల ముందే విరిగిపడ్డ కొండచరియలు..అక్కడ ఏం జరిగింది?

Exit mobile version