Vitamin D : శీతాకాలంలో డిప్రెషన్‌కు విటమిన్ డి కీ సంబంధం ఉందా?

Vitamin D: కొంతమందిలో ఇది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అనే డిప్రెషన్‌కు దారితీయొచ్చు. దీనికి ప్రధాన కారణం, సూర్యరశ్మికి గురికాకపోవడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Vitamin D

వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా శీతాకాలంలో కానీ మేఘావృతమైన రోజుల్లో కానీ చాలా మందిలో మానసిక స్థితి (Mood) లో మార్పులు సంభవిస్తాయి. కొంతమందిలో ఇది సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (Seasonal Affective Disorder – SAD) అనే డిప్రెషన్‌కు దారితీయొచ్చు. దీనికి ప్రధాన కారణం, సూర్యరశ్మి(Vitamin D)కి గురికాకపోవడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సూర్యరశ్మి మన శరీరంలో రెండు ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది..

సెరోటోనిన్ (Serotonin)ని ‘ఫీల్-గుడ్’ హార్మోన్ అని కూడా అంటారు. సూర్యరశ్మి మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మనల్ని అప్రమత్తంగా, ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మి లేకపోవడం వలన సెరోటోనిన్ స్థాయిలు పడిపోయి, మానసిక అలసట , నిరాశకు దారితీస్తుంది.

Vitamin D

మెలటోనిన్ (Melatonin) హార్మోన్ నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది. పగటిపూట సూర్యరశ్మి కళ్లకు సోకినప్పుడు, రాత్రిపూట నాణ్యమైన నిద్ర కోసం మెదడు మెలటోనిన్ ఉత్పత్తిని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. సూర్యరశ్మి లేకపోతే, నిద్ర చక్రం దెబ్బతిని, పగటిపూట నిద్రమత్తు మరియు రాత్రి నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి.

అందుకే, శీతాకాలంలో లేదా మేఘావృతమైన రోజుల్లో కూడా, ఉదయం వేళల్లో కనీసం 15-30 నిమిషాలు ఆరుబయట గడపడం, సూర్యరశ్మిని చర్మానికి , కళ్లకు (నేరుగా కాకుండా) సోకనివ్వడం వలన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

Turmeric milk: పసుపు పాలు రాత్రిపూట ఎందుకు తాగాలో తెలుసా?

Exit mobile version