Sugar: షుగర్ కాదు.. అది తీపి విషం అని తెలుసా?

Sugar: ఒకప్పుడు కేవలం డయాబెటిస్, స్థూలకాయానికి మాత్రమే కారణమనుకున్న పంచదార, ఇప్పుడు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన రోగాలకు కూడా దారితీస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Sugar

చక్కెర.. ఇది మన నాలికకు అమృతంలా అనిపించే ఒక స్నేహపూర్వక శత్రువు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ తెల్లని విషం మన జీవితంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించి, మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా కబళిస్తోందట. ఒకప్పుడు కేవలం డయాబెటిస్, స్థూలకాయానికి మాత్రమే కారణమనుకున్న పంచదార, ఇప్పుడు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన రోగాలకు కూడా దారితీస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ రుచి వెనుక దాగున్న చేదు నిజాల గురించి తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరమని అంటున్నారు డాక్టర్లు.

ఎక్కువగా పంచదార (Sugar) ఉన్న పానీయాలు, టీలు, కాఫీలు అతిగా తాగేవారికి ఇది ముఖ్యమైన విషయనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో షుగర్ ,స్వీటెన్డ్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారికి కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, మెటబాలిక్ సమస్యలు, ఇన్సులిన్ అసమతుల్యత, కొలెస్ట్రాల్, శరీరంలో ఇంఫ్లేమేషన్ వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఈ సర్వేలో షుగర్(sugar) ఉన్న సాఫ్ట్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ , తీయగా ఉండే టీలు ఎక్కువగా తీసుకున్న వారిని నిశితంగా పరిశీలించారు. అంతేకాకుండా, పండ్ల రసాలు (యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష జ్యూస్) తాగేవారిని కూడా గమనించారు. ఈ పరిశీలనలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. జ్యూస్‌లను రోజుకు ఒకసారి తాగేవారిలో కూడా 32 శాతం కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే, షుగర్‌ను తక్కువగా తీసుకున్న వారితో పోలిస్తే, అధికంగా వాడిన వారిపై దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు.

Sugar

అధిక షుగర్(Sugar) ఉండే పానీయాలకు బదులుగా, చక్కెర లేకుండా కాఫీ లేదా కొవ్వులేని పాలు వంటివి తాగడం వల్ల (cancer) రిస్క్ 17% నుంచి 36% వరకు తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది. అందుకే, వీలైనంత వరకు షుగర్ ఉన్న డ్రింకులకు దూరంగా ఉండటం మంచిది. గతంతో పోలిస్తే ప్రస్తుతం షుగర్ బాధితులు పెరగడంతో, చక్కెర వాడకంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే అయినా, షుగర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని డాక్టర్లు చెబుతన్నారు. ఈ “తీపి విషం” మన శరీరానికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.

Also Read: Diabetes: డయాబెటిస్‌కు దంత సమస్యలు తోడవ్వాల్సిందేనా? ముందే చెక్ పెట్టలేమా?

Exit mobile version