Barley water : కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే బార్లీ వాటర్‌ బెనిఫిట్స్ తెలుసుకోండి..

Barley water: బార్లీ కేవలం ఒక ధాన్యం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల గని అంటున్నారు నిపుణులు.

Barley water

ఇప్పుడు మారుతున్న అందరి ఆహారపు అలవాట్ల వల్ల.. చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణంగా మారుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి బార్లీ (Barley) ధాన్యాన్ని ఆహారంలో చేర్చుకోవడం ఒక సులభమైన, సమర్థవంతమైన మార్గం. బార్లీ కేవలం ఒక ధాన్యం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల గని అంటున్నారు నిపుణులు.

బార్లీ(Barley water)లో ముఖ్యంగా బీటా-గ్లూకాన్స్ (Beta-Glucans) అనే కరిగే ఫైబర్ (Soluble Fiber) అధికంగా ఉంటుంది. ఈ బీటా-గ్లూకాన్స్ జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు ఒక జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి.

Barley water

ఈ జెల్ కొలెస్ట్రాల్‌ను, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) ను గ్రహించి, శరీరం నుంచి బయటకు పంపడంలో సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం, రోజూ బార్లీ తీసుకోవడం వలన LDL కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.

గుండె ఆరోగ్యంతో పాటు, బార్లీ (Barley water)డయాబెటిస్ నియంత్రణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎక్కువ ఫైబర్ కంటెంట్ వల్ల, ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదలవుతాయి (Slow Release of Glucose), ఇది రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులను నివారిస్తుంది. బార్లీని పరోక్షంగా బరువు తగ్గడానికి కూడా ఉపయోగించొచ్చు, ఎందుకంటే ఫైబర్ కారణంగా ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. బార్లీని నీటి రూపంలో, లేదా అల్పాహారంలో ఓట్స్‌కు బదులుగా కూడా తీసుకోవచ్చు.

Phone: ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల జరిగేది ఇదేనట..

Exit mobile version