Pumpkin seeds
మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలలో గుమ్మడి గింజలు ముఖ్యమైనవి. ఇవి కేవలం ఒక చిన్న గింజ మాత్రమే కాదు, షుగర్ ఉన్నవారికి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవి ఒక వరం లాంటివి. ఈ గింజలు శరీరంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడమే కాకుండా, ఇంకా ఎన్నో అనూహ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
గుమ్మడి గింజలలో అధిక మోతాదులో ఉండే మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు చాలా మంచివి. ఇవి రక్తపోటును తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా, ఇవి శరీరంలోని వేడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి, మెరుగైన జ్ఞాపకశక్తికి తోడ్పడతాయి.
గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫేన్ అనే ఒక ప్రత్యేక అమైనో ఆసిడ్ శరీరంలో సెరోటోనిన్ గా మారి, నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు కొన్ని గుమ్మడి గింజలు తింటే మంచి నిద్ర పడుతుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, ఆకలిని అదుపులో ఉంచి, బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. గుమ్మడి గింజలను స్నాక్స్‌లా వేయించి తినడం, సలాడ్స్‌లో కలుపుకోవడం, లేదా స్మూతీస్‌లో వాడటం వంటి అనేక రకాలుగా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు.