Kerala: కేరళలో దడపుట్టిస్తున్న కొత్త వ్యాధి.. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో వరుస మరణాలు
కేరళ (Kerala)వైద్యఆరోగ్య శాఖ ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విరివిగా ప్రచారం చేస్తోంది.

Kerala
కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో ఎవ్వరూ మరిచిపోలేరు. కరోనా తర్వాత కూడా పలు వైరస్ లు చాలా దేశాలను వణికించాయి. తాజాగా మన దేశంలోని కేరళ(Kerala)ను ఓ కొత్త వ్యాధి బెంబేలెత్తిస్తోంది. మెదడుని తినే వ్యాధిగా చెప్పుకునే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్ వ్యాధి ప్రాణాలు తీసేస్తోంది. ఈ కొత్త వ్యాధికి గురైన ఇప్పటి వరకు 21 మంది చనిపోయారు.
ఇంకా అనేకమంది వ్యాధి సోకి చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా 100కు పైగా కేసులు నమోదైనట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యాధి సోకితే 97 శాతం చనిపోయే అవకాశం ఉండడంతో ప్రజలు హడలిపోతున్నారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా పదుల సంఖ్యలో మృతిచెందడం, ఇంకా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉండడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ వ్యాధి పెరిగడానికి కారణాలను గుర్తించాలని, దానికి ట్రీట్ మెంట్ విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులను అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈ వ్యాధిని త్వరగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. కేరళ(Kerala) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మైక్రోబయాలజీ ల్యాబ్‌లలో ఈ వ్యాధిని పరీక్షించే సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు కేరళ ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్ చెప్పారు. ఈ ప్రాణాంతక వ్యాధికి ప్రధాన కారణం అపరిశుభ్రంగా ఉండే నీరేనని చెబుతున్నారు.

నిల్వ ఉన్న నీటిలో నివసించే అమీబా వల్ల వస్తుందని గుర్తించారు. తెలిపారు. అమీబా ఉన్న నీరు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్ళినప్పుడు మెదడుకు వేగంగా చేరుతుందని చెబుతున్నారు. నిమిషాల్లోనే మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుందని, అందుకే బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి గా పేరు పెట్టారు. అయితే ఇది కరోనా తరహాలో ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు. కలుషితమైన నీటిని తాగడం వల్ల కూడా సంక్రమించదని, కానీ స్విమ్మింగ్ పూల్ లో ఎక్కువ రోజులు నీటిని మార్చకపోవడం వంటి చోట్ల త్వరగా సంక్రమిస్తుందని పేర్కొంటున్నారు.
దీంతో కేరళ (Kerala)వైద్యఆరోగ్య శాఖ ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విరివిగా ప్రచారం చేస్తోంది. నీటిలో క్లోరినేషన్ కు ప్రాధాన్యత పెంచింది. అలాగే మురికి, నిల్వ ఉన్న నీటిలో స్విమ్మింగ్ చేయడం, స్నానం చేయడం వంటివి చేయొద్దని కోరుతోంది. స్పిమ్మింగ్ చేసినప్పుడు నాజిల్ క్యాప్స్ ధరించాలని స్పష్టం చేసింది.
ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలు చూస్తే జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి కనిపిస్తాయి, సకాలంలోనే స్పందించి వెంటనే డాక్చర్లను సంప్రదించాలని కేరళ వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. అమీబా శరీరంలోకి వెళ్ళిన 9 రోజుల తర్వాత పూర్తి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది. తలనొప్పి , వికారం , వాంతులతో పాటు అమీబా మెదడు కణజాలాన్ని తినేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది.
One Comment