Rambutan: వనవాసంలో రాముడికి ఇష్టమైన పండు.. మీకు రాంబూటాన్ గురించి తెలుసా?

Rambutan:రాంబూటాన్ పండును భారతదేశంలో కేరళలో ఎక్కువగా, అలాగే తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో తక్కువగా సాగు చేస్తున్నారు.

Rambutan

అరుదైన పండ్లలో ఒకటి, అద్వితీయమైన రూపంలో, ఎర్రటి రంగుతో చూసేవారిని ఆకర్షించే పండు రాంబూటాన్. ఈ పండు విచిత్రమైన రూపం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. రాంబూటాన్ పండు తూర్పు ఆసియాలోని మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో పండుతుంది. భారతదేశంలో కేరళలో ఎక్కువగా, అలాగే తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో తక్కువగా సాగు చేస్తున్నారు. అందుకే ఇది అందరికీ సులభంగా అందుబాటులో ఉండదు.

రాంబూటాన్(rambutan) పండు గురించి ఆసక్తికరమైన జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇండోనేషియా, మలేషియా ప్రాంతాల్లోని కథనాల ప్రకారం, వనవాస సమయంలో శ్రీరాముడికి ఈ పండు అంటే చాలా ఇష్టం అంటారు. అందుకే దీనికి రాంబూటాన్ (రాముడి ఇష్టమైన పండు) అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ కథనాలు పండు పవిత్రతను, మధురమైన రుచిని ప్రతీకగా చెబుతాయి.

రాంబూటాన్ (rambutan)పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ C, విటమిన్ B, ఐరన్, ఫైబర్, వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.ఇందులో ఉన్న విటమిన్-C వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది, ఇది శరీరానికి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కవచంలా పనిచేస్తుంది.పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

rambutan

రాంబూటాన్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. విటమిన్-C కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది.
ఇది రక్తహీనతను నివారించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

రాంబూటాన్(rambutan) ఎక్కువ తేమ, అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. పైగా, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ కారణాల వల్ల మన దేశంలో ఇది ప్రధాన మార్కెట్లలో కనిపించదు. అందుకే దీని గురించి చాలామందికి తెలియదు. రాంబూటాన్ పండును తాజా పండుగా, లేదా ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు, డెజర్ట్‌లలో కూడా ఉపయోగిస్తారు.

అయితే, ఈ పండు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కొంతమందికి ఈ పండులోని ప్రొటీన్ల వల్ల చర్మంపై దద్దుర్లు లేదా శ్వాసకోశ సమస్యలు వంటి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాక, ఈ పండు బాగా పండినప్పుడు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పండు గింజలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. గర్భిణీలు, పిల్లలు ,ఫ్రూట్ అలర్జీలు ఉన్నవారు రాంబూటాన్ పండును మితంగా తీసుకోవడం మంచిది.

Lose weight: బరువు తగ్గితే బోనస్.. పెరిగితే ఫైన్..ఎక్కడో తెలుసా?

Exit mobile version