Star Anise:అనాస పువ్వు కూడా ఆరోగ్యానికి వరమేనట..ఎలా వాడాలో తెలుసా?

Star Anise: జ్వరం వచ్చినప్పుడు అనాస పువ్వును తీసుకోవడం వల్ల త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇది తలనొప్పి, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Star Anise

వర్షాకాలంలో చాలా మందిని సీజనల్ వ్యాధులు వేధిస్తుంటాయి. ముఖ్యంగా జలుబు, తలనొప్పి, జ్వరం, దగ్గు వంటివి సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతాయి. అయితే, మన వంటగదిలోని మసాలా దినుసుల్లో ఒకటైన అనాస పువ్వు (Star Anise) ద్వారా ఈ సీజనల్ వ్యాధులకు అద్భుతంగా చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అనాస పువ్వుతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు:

జ్వరం, జలుబు నుంచి ఉపశమనం..జ్వరం వచ్చినప్పుడు అనాస పువ్వును తీసుకోవడం వల్ల త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఇది తలనొప్పి, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే థైమొల్ (Thymol), టెర్పినోల్ (Terpineol) వంటి సమ్మేళనాలు శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి పెరుగుదల.. ఈ పువ్వును నీటిలో వేసి బాగా మరిగించి, ఆ టీని రోజూ ఒక గ్లాసు తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

Star Anise

జీర్ణ, మూత్రాశయ సమస్యలకు పరిష్కారం.. అనాస పువ్వు జీర్ణ సమస్యలు , మూత్రాశయ సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. మలబద్ధకం (Constipation) సమస్యతో బాధపడేవారు దీనిని ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వికారం, వాంతులకు ఉపశమనం.. వికారం (Nausea) లేదా వాంతులు అవుతున్నప్పుడు ఈ పువ్వు వాసనను పీల్చితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

మహిళల ఆరోగ్యానికి.. రుతుక్రమం (Menstruation) సమయంలో కడుపు నొప్పితో బాధపడే మహిళలు అనాస పువ్వును ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అనాస పువ్వు(Star Anise)ను సాధారణ వంటకాలతో పాటు, టీ రూపంలో తీసుకోవడం వలన సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

Aqil Akhtar: డ్రగ్స్ వల్లే చనిపోయాడు… మాజీ డీజీపీ కుమారుడి కేసులో ట్విస్ట్

Exit mobile version