Food: ఈ ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మంచివి కావట..

Food: పాలు,అరటిపండు..ఈ రెండూ విడివిడిగా తీసుకుంటే ఎన్నో పోషక ప్రయోజనాలు ఉంటాయి.

Food

ఆహార (Food)ప్రియులు తమకు నచ్చిన ఆహార(Food) పదార్థాలను ఇష్టమొచ్చినట్లు కలిపి తినేస్తుంటారు. కానీ, కొన్ని పదార్థాలను కలిపి తినడం వల్ల కలిగే అనర్థాల గురించి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదం, పోషకాహార నిపుణులు కూడా కొన్ని ఆహార(Food) పదార్ధాలను కలిపి తీసుకోకూడదని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఆయుర్వేదం ప్రకారం తేనె, నెయ్యిని ఒకేసారి ముఖ్యంగా సమాన మోతాదులో కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ రెండూ ఒకేసారి శరీరంలోకి వెళ్లినప్పుడు జీర్ణక్రియలో సమస్యలు తలెత్తవచ్చు. అందుకే, నెయ్యితో చేసిన వంటకాలు తిన్న వెంటనే తేనెను తీసుకోకుండా ఉండటం మంచిది.

పాలు,అరటిపండు..ఈ రెండూ విడివిడిగా తీసుకుంటే ఎన్నో పోషక ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది బనానా మిల్క్‌ షేక్ ఇష్టంగా తాగుతారు .అయితే మిల్క్ షేక్‌లా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ కలయిక జీర్ణవ్యవస్థను నెమ్మది చేయొచ్చు. కొన్ని సందర్భాలలో ఇది శరీరంలో టాక్సిన్స్‌ను పెంచి, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందువల్ల, ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

Food

చాలా మంది భోజనం ముగిశాక వెంటనే పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ,చికెన్ లేదా మాంసాహారం తిన్న తర్వాత వెంటనే పండ్లు తినకూడదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న చికెన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో పండ్లు కూడా తింటే, జీర్ణక్రియ వ్యవస్థపై మరింత ఒత్తిడి పడుతుంది. దీనివల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చాకే పండ్లు తినడం మంచిది.

ఇడ్లీ, దోశ పిండిలో మినప్పప్పు ఉంటుంది. ఈ పదార్థాలను పెరుగుతో కలిపి తినడం వల్ల కలిగే సమస్యలు చాలామందికి తెలియవు. మినప్పప్పు, పెరుగు కలిపి తీసుకుంటే శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు పెరుగు వడ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

Bigg Boss: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది..

Exit mobile version