Money: డబ్బు వెనక పరుగులో మీరు కోల్పోతుంది ఏంటి?

Money: శాంతి దూరమవ్వడానికి మొదటి కారణం పోలిక. మన దగ్గర ఎంత ఉందో చూసుకుని సంతోషపడటం మానేసి, మనకంటే ఎక్కువ ఉన్నవారితో పోల్చుకుంటున్నాం.

Money

ఆధునిక మనిషి ఎదుర్కొంటున్న మౌన యుద్ధంఒకప్పుడు మన పెద్దవాళ్లు తక్కువ సంపాదన(Money)తో కూడా చాలా ప్రశాంతంగా ఉండేవారు. చిన్న ఇల్లు, పరిమితమైన అవసరాలు ఉన్నా మనసు నిండా నెమ్మది ఉండేది.

కానీ ఇప్పుడు జీతాలు పెరిగాయి, అవకాశాలు పెరిగాయి, విలాసవంతమైన జీవితం దొరికింది. అయినా సరే, ఇంత సంపాదించినా మనసుకు శాంతి ఎందుకు లేదు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. డబ్బు పెరిగితే సమస్యలు తగ్గాలి, కానీ అవి రూపం మార్చుకుని పెరుగుతున్నాయి.

శాంతి దూరమవ్వడానికి మొదటి కారణం పోలిక. మన దగ్గర ఎంత ఉందో చూసుకుని సంతోషపడటం మానేసి, మనకంటే ఎక్కువ ఉన్నవారితో పోల్చుకుంటున్నాం.

పక్కింటి వాడికి కారు ఉంటే మనకు ఉండాలి, స్నేహితుడు విదేశీ యాత్రకు వెళ్తే మనం వెళ్లాలి అనే పోటీ మనల్ని అసంతృప్తిలోకి నెట్టేస్తోంది. డబ్బుతో భద్రత వస్తుందని మనం అనుకుంటాం, కానీ డబ్బు పెరిగే కొద్దీ ఆ స్థాయిని ఎలా కాపాడుకోవాలి? ఆదాయం పడిపోతే ఏంటి? అనే కొత్త భయాలు పుట్టుకొస్తున్నాయి.

Money

డబ్బు (Money)పెంచుకోవాలనే తాపత్రయంలో మన సమయాన్ని మనమే దొంగిలిస్తున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు కాల్స్, మెసేజ్‌లు, డెడ్‌లైన్స్‌తో బతుకుతున్నాం. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు చేరుతోంది కానీ, కంటి నిండా నిద్ర, కుటుంబంతో గడిపే సమయం జారిపోతున్నాయి. సాయంత్రం ఇంటికి వచ్చినా మెదడు ఆఫీసు పనుల్లోనే ఉంటుంది.

దీనికి తోడు పెరిగిన విలాసాలు మన అవసరాలను పెంచేశాయి. ఈ సర్కిల్ నుంచి మనిషి బయటకు రాలేక అలసిపోతున్నాడు. మనుషుల మధ్య మాటలు తగ్గి, అందరూ స్క్రీన్లలో మునిగిపోతున్నారు. డబ్బు అవసరమే, కానీ అది యజమాని కాకూడదు, ఒక సాధనం మాత్రమే కావాలి. మనకు ఎంత సరిపోతుంది అనే స్పష్టత ఉన్నప్పుడే మనసులో శాంతి మొదలవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version